NY 2026 పార్టీ: ప్రేమ గువ్వ‌లు విదేశాల‌కు జంప్

పాత సంవ‌త్స‌రానికి `భాయ్ భాయ్` చెప్పి, కొత్త సంవ‌త్స‌రానికి వెల్ కం చెప్ప‌డానికి ప్రేమ గువ్వ‌లు- చిట్టి గువ్వ‌లు చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఎదురు చూస్తున్నాయి.;

Update: 2025-12-29 15:03 GMT

పాత సంవ‌త్స‌రానికి `భాయ్ భాయ్` చెప్పి, కొత్త సంవ‌త్స‌రానికి వెల్ కం చెప్ప‌డానికి ప్రేమ గువ్వ‌లు- చిట్టి గువ్వ‌లు చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఎదురు చూస్తున్నాయి. డిసెంబ‌ర్ చలిగిలి కాలం, ప్రేమ‌లు ఉప్పొంగే వేళ‌.. గ‌`మ్మ‌త్త‌`యిన చోటు కోసం వెతుకుతున్నాయి. చాలా ప్రేమ జంట‌లు ఒంట‌రి దీవుల‌కు విహార‌యాత్ర‌ల‌కు వెళుతున్నాయి. ముఖ్యంగా సెల‌బ్రిటీ ప్రేమ ప‌క్షులు కొత్త వెచ్చ‌ని గూడు (నెస్ట్) కోసం వెతుకుతున్నాయి.

చాలా కాలంగా ప్రేమలో త‌ల‌మున‌క‌లుగా ఉన్నారంటూ మీడియా హెడ్ లైన్స్ లోకి వ‌స్తున్న ఇబ్ర‌హీం అలీఖాన్- పాల‌క్ తివారీ జంట కూడా ఇప్పుడు కొత్త గూడు వెతికే ప‌నిలో ఉన్నారు. ఈ జంట క‌లిసి విమానాశ్ర‌యంలో కెమెరా కంటికి చిక్క‌డంతో ఎవ‌రికి వారు ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగిస్తున్నారు. కొత్త‌ సంవ‌త్స‌ర వేడుక‌ల కోసం ఒక ఎగ్జోటిక్ ఒంట‌రి దీవిని వెతుకుతున్నార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

స్వ‌దేశంలోనే కొత్త గూడు వెతుకుతున్నారా? లేక విదేశాల‌కు జంప్ అవుతున్నారా? అన్నదానికి ఇంకా స్పష్ఠ‌త లేదు కానీ, క‌లిసి ఓ చోటికి ప్ర‌యాణిస్తున్నార‌ని అంద‌రికీ అర్థ‌మైంది. ఇటీవ‌ల ఈ జంట‌ ముంబై విమానాశ్రయంలో కనిపించడంతో మీడియా ఊహల‌కు రెక్క‌లొచ్చాయి. ఆ స‌మ‌యంలో ఇబ్రహీం పూర్తిగా నలుపు రంగు దుస్తులలో చాలా స్టైలిష్‌గా కనిపించారు. విమానాశ్రయంలోకి వెళ్లే ముందు అత‌డు కెమెరాలకు పోజులిచ్చారు. ఇబ్రహీంతో పాటు గాళ్ ఫ్రెండ్ పాలక్ తివారీ కూడా పూర్తిగా నలుపు రంగు దుస్తుల‌లోనే క‌నిపించడం కొస‌మెరుపు. ఒక ప్ర‌త్యేక‌మైన డ్రెస్ కోడ్‌లో ఈ జంట విమానాశ్ర‌యానికి రావడం యాధృచ్ఛికం కాదు.. ప్లాన్ ప్ర‌కార‌మే జ‌రిగింద‌ని ఊహిస్తున్నారు.

క‌లిసి విదేశాల‌కు జంప్ అయ్యార‌నేదానికి ఆధారం లేక‌పోయినా క‌లిసి ఒకే చోటికి వెళ్లార‌న‌డానికి ఇదే స‌రైన‌ ఆధారం. ఇబ్రహీం- పాలక్ కొత్త సంవత్సరం వెకేష‌న్స్ ని ఎంజాయ్ చేయ‌డం కోసం విదేశాలకు వెళ్లార‌ని అంతా ఊహిస్తున్నారు. ప్రైవ‌సీ మ్యాట‌ర్ కోస‌మే ఈ యువ‌జంట ప్లాన్ చేసి ఉండొచ్చ‌ని ఊహాగానాలు సాగిస్తున్నారు.

2022లో ఇబ్రహీం - పాలక్ కలిసి కనిపించిన తర్వాత వారి మధ్య ప్రేమాయణం నడుస్తోందనే పుకార్లు మొదలయ్యాయి. ఆ త‌ర్వాత చాలా సార్లు క‌లిసి క‌నిపించారు. ఇబ్ర‌హీం కొత్త కార్ కొన్న‌ప్పుడు దానిని లాంచ్ చేసేందుకు పాల‌క్ సైఫ్ ఖాన్ ఇంటికి వ‌చ్చింది. వారిద్దరూ క‌లిసి ఒక మ్యూజిక్ కాన్సెర్ట్‌లో కలిసి కనిపించారు. చాలా వెకేష‌న్స్ నుంచి ఫోటోలను షేర్ చేసారు. దీంతో ఈ జంట డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు వేడెక్కించాయి.

అయితే పాల‌క్ కానీ, ఇబ్రహీం కానీ డేటింగ్ ని క‌న్ఫామ్ చేయ‌లేదు. మేమిద్ద‌రం క‌లిసి బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు ఫోటోలు తీసారు అంతే.. అప్పుడు మేం స్నేహితుల‌తో క‌లిసి ఉన్నాము! అని తెలిపింది. తాము కలిసి కనిపించినప్పుడు కేవలం ఇద్దరం మాత్రమే లేక‌పోయినా, తాము డేటింగ్ చేస్తున్నామనే కథే ప్రజలకు ఎక్కువగా నచ్చిందని పాలక్ పేర్కొంది. ఇబ్రహీం చాలా మంచి వ్యక్తి అని, తాము కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేసింది. తాము అప్పుడప్పుడు మాత్రమే మాట్లాడుకుంటామని కూడా చెప్పింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే, ఇబ్రహీం అలీ ఖాన్ `నదానియాన్` చిత్రంతో తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత కాజోల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లతో కలిసి `సర్జమీన్` చిత్రంలో నటించాడు. కానీ ఇవి రెండూ బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన విజ‌యాలు సాధించ‌లేదు. పాలక్ తివారీ చివరిగా `భూత్ని` అనే హారర్-కామెడీ చిత్రంలో కనిపించింది. సంజయ్ దత్, మౌని రాయ్‌లతో కలిసి న‌టించిన అనుభ‌వం గురించి పాల‌క్ ఉత్సాహంగా వెల్ల‌డించింది.

Tags:    

Similar News