ఆ సినిమాలో నేను లేను : కృతి శెట్టి
మాల్స్ ఓపెనింగ్ కు వెళ్లిన సమయంలో వారు కొన్ని సార్లు అసాధారణ సంఘటనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో కాస్త ఫేమ్ అవ్వగానే బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరించడం మరియు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళ్లడం సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం. మాల్స్ ఓపెనింగ్ కు వెళ్లిన సమయంలో వారు కొన్ని సార్లు అసాధారణ సంఘటనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
జనాలు ఎక్కువగా రావడంతో ఇబ్బంది పడ్డ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇక ఆ సమయంలో తమ పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తించడం కూడా జరుగుతుంది. కాస్త అటు ఇటుగా ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి కి కూడా అలాంటి ఒక సంఘటన ఎదురవ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కృతి శెట్టి ఇటీవల ఒక మాల్ ఓపెనింగ్ కు వెళ్లింది. అక్కడ ఒక అభిమాని మీ యొక్క స్కంద మూవీ చాలా బాగుంది అన్నాడు. అయితే అందులో కృతి శెట్టి నటించలేదు. దానికి కృతి నుంచి పెద్దగా రియాక్షన్ ఏమీ రాలేదు. కానీ ఆ సినిమాలో నేను లేను అని మాత్రం సమాధానం వచ్చింది.
అడిగిన వ్యక్తి రామ్ తో ఆమె కలిసి నటించిన మరో సినిమా ది వారియర్ గురించి మాట్లాడి ఉంటాడు. పొరపాటున స్కంద అని ఉంటాడు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో కృతి శెట్టి ఎక్కువగా స్పందించకుండా సింపుల్ గా తాను ఆ సినిమాలో లేను అని చెప్పడం జరిగింది.
మరే హీరోయిన్ అయినా ఆ విషయంలో మరో విధంగా స్పందించే వారు.. కచ్చితంగా సోషల్ మీడియాలో అదో ఇష్యూగా మారి ఉండేది. కానీ కృతి శెట్టి మాత్రం నవ్వుతూ స్కంద సినిమా లో నేను లేను అనేసింది అంటూ బేబమ్మ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.