స్టార్ హీరో 1000 కోట్ల బిజినెస్ వెనక షాడో
అయితే ఇంత పెద్ద స్టార్ అనూహ్యంగా 2023లో వ్యాపార రంగంలో ప్రవేశించాడు. అతడు పెట్టిన పెట్టుబడికి భారీ లాభాలు కురుస్తున్నాయి.;
అతడు భారతదేశంలోని అతిపెద్ద సూపర్ స్టార్లలో ఒకరు. అతడి డ్యాన్సులకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఫాలోయింగ్ ఉంది. `గ్రీక్ గాడ్` అంటూ అభిమానులు పిలుచుకుంటారు. అతడి మెలి తిరిగిన కండలు, తీరైన రూపురేఖలకు యూత్ ఫిదా అయిపోతుంది. అతడిని గాళ్స్ విపరీతంగా ఆరాధిస్తారు. భారతదేశంలో ఒక్కో సినిమాకు 100 కోట్లు డిమాండ్ చేసే స్టార్లలో అతడు ఒకరు.
అయితే ఇంత పెద్ద స్టార్ అనూహ్యంగా 2023లో వ్యాపార రంగంలో ప్రవేశించాడు. అతడు పెట్టిన పెట్టుబడికి భారీ లాభాలు కురుస్తున్నాయి. తన ఉత్పత్తికి తానే బ్రాండ్ అంబాసిడర్. యూత్ ని ఎక్కువగా ఆకర్షిస్తూ ఇది మార్కెట్లో ట్రెండింగ్ బిజినెస్ గా మారింది. కేవలం రెండేళ్లలోనే 1000 కోట్ల రేంజ్ వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగింది.
అయితే దీనివెనక ఉన్న అసలు మెదడు ఎవరో ఇప్పటికీ బయటి ప్రపంచానికి తెలియదు. సూపర్ స్టార్ 1000 కోట్ల సామ్రాజ్యం వెనక అతడి భాగస్వామి పాదరసం లాంటి మెదడు, ఆలోచన చాలా కీలకపాత్ర పోషించాయి. అలాంటి తెలివైన వ్యక్తితో సహభాగస్వామిగా 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేయగలిగలిగిన ఈ హీరో మరెవరో కాదు.. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్. షాడో రూపంలో ఉన్న ఈ మేధావి పేరు అఫ్సర్ జైదీ. అతడు కంపెనీ సీఈవో. ఇప్పుడు ఈ కంపెనీ పేరును పరిచయం చేయనవసరం లేదు.
యూత్ నిరంతరం ఫ్యాషన్ బ్రాండ్స్ కోసం, స్పోర్ట్స్ గార్మెంట్స్ కోసం ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేసే ఈ కంపెనీ పేరు HRX. స్టార్ హీరో హృతిక్ రోషన్ ముఖవిలువకు అఫ్సర్ జైదీ మెదడు అతి పెద్ద బూస్ట్ గా మారి అనతికాలంలోనే ఈ బ్రాండ్ వేగంగా పాపులరైంది. అతి తక్కువ కాలంలో వేగంగా ఎదిగిన కంపెనీగా HRX పాపులరవ్వడంలో హృతిక్ స్టార్ డమ్ కూడా సహకరించింది. హృతిక్ రోషన్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి వార్ 2లో నటిస్తున్నారు. తదుపరి క్రిష్ 4 చిత్రానికి హృతిక్ దర్శకత్వం వహిస్తూ త్రిపాత్రాభినయం చేస్తారని టాక్ ఉంది.