మ‌ట్టి ఇటుక‌ను సైతం అరిగించ‌గ‌ల న‌టుడు!

బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్- విక్కీ కౌశల్ అద్భుతమైన ఫిజిక్‌తో ప్రేక్షకులను ఎప్పుడూ ఆశ్చర్య పరుస్తుంటారు.;

Update: 2026-04-16 03:15 GMT

బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్- విక్కీ కౌశల్ అద్భుతమైన ఫిజిక్‌తో ప్రేక్షకులను ఎప్పుడూ ఆశ్చర్య పరుస్తుంటారు. అయితే వీరిద్దరికీ శిక్షణ ఇచ్చే ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ ముస్తఫా అహ్మద్ తాజాగా ఇద్ద‌రి ఫిట్‌నెస్‌కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. హృతిక్ రోషన్ అంటే క్రమశిక్షణతో కూడిన డైట్, కండలు తిరిగిన దేహం గుర్తుకొస్తుంది. కానీ ముస్తఫా మాటల ప్రకారం.. హృతిక్ లోపల ఒక పెద్ద భోజన ప్రియుడు దాగి ఉన్నాడు. `హృతిక్ ఎంత బాగా తింటాడంటే.. నేను ఒకేసారి ఆయన 13 నుండి 14 నెయ్యి రాసిన చపాతీలను అవలీలగా తినేయడం చూశాను.

తర్వాతి చపాతీ రావడానికి ఆలస్యం కావడం వల్ల మాత్రమే ఆయన తినడం ఆపారు` అని ముస్తఫా చమత్కరించారు. అయితే ఎంత తిన్నా? దాన్ని కరిగించడానికి హృతిక్ చేసే శ్రమ కూడా అదే స్థాయిలో ఉంటుంద‌న్నారు. మరో స్టార్ హీరో విక్కీ కౌశల్ గురించి ముస్తఫా ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. `విక్కీకి ఒక ఇటుక ముక్కను ఇచ్చినా అరిగించుకోగల శక్తి ఉంది`అని వ్యాఖ్యానించారు. విక్కీకి ఎంత ఆహారం తిన్నా అది త్వరగా అరిగిపోతుంది. దానివల్ల ఆయన బరువు పెరగడం లేదా కండరాలు పెంచడం చాలా కష్టమైన పని అని ముస్తఫా తెలిపారు.

విక్కీ శరీరం సహజంగానే సన్నగా ఉండటం వల్ల ఆయన కోసం ప్రత్యేకమైన బల్కింగ్ డైట్‌ను రూపొందించాల్సి వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. హృతిక్, విక్కీలే కాదు ధురంధర్ హీరో రణవీర్ సింగ్ గురించి కూడా ముస్తఫా కొన్ని రహస్యాలను పంచుకున్నారు. ఈ సినిమా కోసం రణవీర్ 75 కిలోల నుండి 87 కిలోల బరువు పెరగాల్సి వచ్చింది. దాని కోసం ఆయన ప్రతిరోజూ అత్యంత బోరింగ్ డైట్‌ను కూడా ఎంతో క్రమశిక్షణతో పాటించారు. రణవీర్ ఒక్కో మీల్ పూర్తి చేయడానికి దాదాపు 45 నిమిషాల సమయం తీసుకునేవారు. ఆహారం విషయంలో ఆయనకున్న నియంత్రణే బీస్ట్ లుక్‌లో చూపించిందని ముస్తఫా కొనియాడారు.

ట్రైన‌ర్ ముస్తాపా ప్ర‌యాణం ఎంతో స్పూర్తివంత‌మైంది. డిస్లెక్సియాతో పోరాడి నెలకు 10 వేల రూపాయల జీతంతో జిమ్ ట్రైనర్‌గా కెరీర్ ప్రారంభించాడు. హృతిక్ రోషన్ వంటి దిగ్గజాలకు శిక్షణ ఇవ్వడమే కాకుండా న‌టుడిగానూ మారాడు. ధురంధ‌ర్ చిత్రంలో ఏజెంట్ రిజ్వాన్ పాత్రలో నటించి అందరి మెప్పు పొందుతున్నాడు. నటనపై మక్కువతో ఓ చిన్న పాత్ర అడిగితే ఆదిత్య ధర్ ఏకంగా ఓ కీలక పాత్రను ఇచ్చారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News