రావిపూడి.. ఈసారి అంత ఈజీ కాదేమో!
అలా సక్సెస్ ట్రాక్ లో ఉన్న అనిల్ రావిపూడి.. ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్-3, భగవంత్ కేసరితో కూడా హిట్స్ నే అందుకున్నారు.ఈ ఏడాది సంక్రాంతికి మళ్లీ వెంకీతో వర్క్ చేసి సంక్రాంతి వస్తున్నాం మూవీని తెరకెక్కించారు.;
టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి అందరికీ తెలిసిందే. 100 స్ట్రైక్ రేట్ తో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న దర్శకుల్లో రాజమౌళి తర్వాత ఆయనే. పదేళ్ల క్రితం డైరెక్టర్ గా పటాస్ తో ఎంట్రీ ఇచ్చాక.. ఇప్పటి వరకు ఫెయిల్యూర్ అనేది లేకుండా వంద శాతం సక్సెస్ రేట్ కొనసాగిస్తున్నారు. సినీ ప్రియులను విపరీతంగా అలరిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పటాస్ మూవీ తీసిన అనిల్ రావిపూడి.. డెబ్యూతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఫస్ట్ మూవీ భారీ విజయం సాధించడంతో అందరి దృష్టిని ఆకర్షించారు.
ఆ తర్వాత మెగా మేనల్లుడు సాయి దుర్గతేజ్ తో సుప్రీం మూవీ తీయగా.. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. మూడో మూవీ మాస్ మహారాజా రవితేజ రాజా ది గ్రేట్ మూవీ చేసి హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకున్నారు రావిపూడి. విమర్శకులను కూడా మెప్పించారు. ఆ తర్వాత సీనియర్ హీరో వెంకటేష్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎఫ్-2 చేసిన ఆయన.. కామెడీని నెక్స్ట్ లెవెల్ లో పండించి భారీ విజయం సాధించారు. సంక్రాంతి బరిలో దిగి అందరినీ ఆకట్టుకున్నారు.
నెక్ట్స్ ఏడాది కూడా సంక్రాంతికి వచ్చి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అలా సక్సెస్ ట్రాక్ లో ఉన్న అనిల్ రావిపూడి.. ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్-3, భగవంత్ కేసరితో కూడా హిట్స్ నే అందుకున్నారు.ఈ ఏడాది సంక్రాంతికి మళ్లీ వెంకీతో వర్క్ చేసి సంక్రాంతి వస్తున్నాం మూవీని తెరకెక్కించారు.బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్ ను అందుకున్నారు. అదే సమయంలో ఇప్పటి వరకు సంక్రాంతి బరిలో మూడు సినిమాలతో దిగి.. విజయాలు సొంతం చేసుకున్నారు. పెర్ఫెక్ట్ సంక్రాంతి డైరెక్టర్ అనిపించుకున్నారు.
ఇప్పుడు వచ్చే ఏడాది అదే పండక్కి రానున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న మన శంకర వరప్రసాద్ గారు మూవీని అప్పుడే రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా కూడా హిట్ అవుతుందని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అంత ఈజీ కాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కంటెంట్ బాగుండి.. పాజిటివ్ టాక్ వస్తేనే అది సాధ్యమవుతుదని, లేకుంటే చెప్పలేమని చెబుతున్నారు.
ఎందుకంటే సంక్రాంతికి గత రెండు సార్లు వచ్చిన అనిల్ రావిపూడి.. ఫ్యామిలీ ఎంటర్టైనర్లు ఎఫ్- 2, సంక్రాంతి వస్తున్నాం చిత్రాలతో విజయాలు అందుకున్నారు. ఈసారి కూడా అదే జోనర్ లో చిరు మూవీని తీస్తున్నారు. అయితే 2019లో ఎఫ్ 2 రిలీజ్ అయిన టైమ్ లో అదొక్కటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ తర్వాత ఈ ఏడాది కూడా డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ తోపాటు సంక్రాంతి వస్తున్నాం రిలీజ్ అవ్వగా.. .. అదొక్కటే ఫ్యామిలీ ఎంటర్టైనర్. దీంతో ఆయనకు బాగా కలిసొచ్చింది.
కానీ 2019 & 2025 లాగా కాకుండా, వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్న అనగనగా ఒక రాజు, ది రాజా సాబ్ సినిమాలు కూడా ఎంటర్టైనర్లే.అదే సమయంలో నవీన్ పోలిశెట్టి తన పండుగ ప్రోమోలతో ఆడియన్స్ ను దృష్టిని ఆకర్షిస్తున్నారు. అటు రాజా సాబ్ పై కూడా ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది. దీంతో మన శంకర వరప్రసాద్ గారు మూవీకి గట్టి పోటీనే ఎదురవనుంది. మరి అనిల్ రావిపూడి.. సినిమాను ఎలా తీస్తున్నారో.. ఎంతలా మెప్పిస్తారో.. ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.