హిట్ 3 వర్సెస్ రెట్రో.. ఎవరికి ప్లస్
ఐతే సూర్య రెట్రోని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. తప్పకుండా సూర్య రెట్రో నుంచి నానికి టఫ్ ఫైట్ తప్పేలా లేదు.;
సమ్మర్ లో స్టార్ సినిమాల ఫైట్ కామనే. ఐతే ఈసారి మే 1న ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతుంది. ఆరోజు న్యాచురల్ స్టార్ నాని శైలేష్ కొలను కాంబినేషన్ లో వస్తున్న హిట్ 3 ఫ్యాన్స్ కి మంచి మాస్ ఫీస్ట్ అందించేందుకు రెడీ అవుతున్నాడు. హిట్ ఫ్రాంచైజీలో భాగంగా హిట్ 3 సినిమా వస్తుంది. అర్జున్ సర్కార్ గా నాని తన సత్తా చాటాలని చూస్తున్నాడు. హిట్ 3 లో కె.జి.ఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా అంచనాలు పెంచుతూ వచ్చింది.
ఇక ఈ సినిమాకు పోటీగా కోలీవుడ్ స్టార్ సూర్య రెట్రో వస్తుంది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తో వస్తుంది. సినిమాలో సూర్య లుక్స్ ఇంకా మాస్ ఎపిసోడ్స్ అన్నీ కూడా వింటేజ్ సూర్యని గుర్తు చేసేలా ఉంది. సూర్య కంప్లీట్ మాస్ సినిమాతో వచ్చి చాలా రోజులైంది. అందుకే రెట్రో తో ఫ్యాన్స్ కి ఫుల్ మాస్ ట్రీట్ ఇచ్చేలా వస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా నుంచి ఈమధ్య వచ్చిన ఒక సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. నాని హిట్ 3 వర్సెస్ సూర్య రెట్రో ఈ సినిమాల మధ్య ఆసక్తికరమైన ఫైట్ జరుగుతుంది. సూర్య రెట్రోతో నాని హిట్ 3 తో కచ్చితంగా ఈ సినిమాల మధ్య ఈ పోటీ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అందిస్తుందని చెప్పొచ్చు. వరుస హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న నాని తప్పకుండా హిట్ 3 తో కూడా మరో సక్సెస్ అందుకునేలా ఉన్నాడు.
ఐతే సూర్య రెట్రోని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. తప్పకుండా సూర్య రెట్రో నుంచి నానికి టఫ్ ఫైట్ తప్పేలా లేదు. అదీగాక సూర్య రెట్రో సినిమాను సితార బ్యానర్ తెలుగు హక్కులు సొంతం చేసుకుంది. సో సినిమాను ఇక్కడ భారీగానే రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. నాని హిట్ 3 అతని సొంత నిర్మాణంలో వస్తున్న సినిమా కాబట్టి కచ్చితంగా సినిమా అంచనాలకు తగినట్టుగానే ఉంటుంది. ఐతే ఈ సినిమాలో కార్తి స్పెషల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది.
ఐతే మరోపక్క సూపర్ స్టార్ రజినికాంత్ కూలీ కూడా మే 1న రిలీజ్ అనుకున్నారు. ఐతే ఆ సినిమా రిలీజ్ పై ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ రజినీ వస్తే మాత్రం ఈ ఫైట్ మరింత క్రేజీగా మారే అవకాశం ఉందని చెప్పొచ్చు.