• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హాయ్ నాన్న వెరీ స్పెషల్.....

హాయ్ నాన్న వెరీ స్పెషల్.. వాళ్లే నా టార్గెట్..

| సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్ధుల్ వాహబ్ సినిమా గురించి విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

By - Tupaki Desk
Update: 2023-12-05 12:54 GMT

న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో వస్తున్న సినిమా హాయ్ నాన్న. మోహన్ చెరుకూరు, డాక్టర్ విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను నూతన దర్శకుడు శౌర్యువ్ డైరెక్ట్ చేశారు. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ మూవీగా వస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. సినిమాకు హేషం అబ్ధుల్ వాహబ్ మ్యూజిక్ అందించగా రిలీజైన సాంగ్స్ అన్ని ప్రేక్షకాదరణ పొందాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్ధుల్ వాహబ్ సినిమా గురించి విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

తెలుగులో చేసిన మొదటి చిత్రంతోనే ఇక్కడ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు కదా.. ఈ ఆదరణ ఎలా అనిపిస్తోంది?

చాలా ఆనందంగా వుంది. అయితే ఇంకా చాలా నేర్చుకోవాలి. ప్రతి సినిమా ఒక పరీక్షే. ప్రతి సినిమా ఒక లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్. ఇంకా కొత్తగా ఎక్స్ ఫ్లోర్ చేయాలి. హాయ్ నాన్న చిత్రం నన్ను నేను ఎక్స్ ఫ్లోర్ చేసుకోవడానికి తోడ్పడింది.

హృదయం, ఖుషి, హాయ్ నాన్న..ఇలాంటి చిత్రాలన్నిటిలో కామన్ గా లవ్, రొమాన్స్, డ్రామా వుంటుంది కదా.. వీటిలోనే కొత్తదనం చూపించడానికి ఎలాంటి కసరత్తులు చేస్తారు ?

ఇది కేవలం సంగీత దర్శకుడే కాదు.. దర్శకుడు, రచయిత, ఎడిటర్.. అలా అందరూ కొత్తదనం ఎలా చూపించాలనే విషయంపైనే దృష్టి పెడతారు. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ ఒకేలా వుంటుంది. ఒకరు ప్రేమను అంగీకరించడం, మరొకరు తిరస్కరించడం, మనస్పర్థలు రావడం, విడిపోవడం, మళ్ళీ కలవడం ఇలాంటి పరిస్థుతులే వుంటాయి. అయితే ఆ కథని ఎంత యూనిక్ గా చెబుతున్నామనేది ఇక్కడ ముఖ్యం. కాదల్, రోజా, ముంబై, ఓకే బంగారం.. ఇలా ఈ చిత్రాల థీమ్స్ సిమిలర్ గా ఉండొచ్చు. అయితే దర్శకుడు ఆ కథని ఎలా చెప్పారనే దానిపైనే వైవిధ్యం ఆధారపడి వుంటుంది. సంగీతం కూడా అలానే వుంటుంది. ప్రేమ పాటల్ని విన్నప్పుడు ఒకే ఎమోషన్ వుంటుంది. హాయిగా, రొమాంటిక్ గా ఫీలౌతాం. అయితే ఆ పాట ఎవరు పాడారు, అక్కడ ఎలాంటి సాహిత్యం, సందర్భం వుందనేది కొత్త క్రియేషన్ తీసుకొస్తుంది.

దర్శన, సమయమా.. ఈ రెండు పాటలకు చాలా మంది పోలికలు తీసుకొస్తున్నారు.. దీని గురించి?

ఈ పోలిక తీసుకురావడం సహజమే. ఎందుకంటే దర్శన, సమయమా.. ఈ రెండు పాటల మొదటి నోట్ ఒకేలా వుంటుంది. కానీ దర్శన కంటే క్లాసిక్ కంపోజిషన్ సమయమాలో వినిపిస్తుంది. అయితే ఆడియన్స్ చాలా తెలివిగా, అప్డేట్ గా వుంటారు. దర్శనతో పోలిక పెట్టడం ఆనందమే. రెండు పాటలు వైరల్ అయ్యాయి(నవ్వుతూ)

నిరంతరం కొత్త ట్యూన్స్ ఇవ్వడం కోసం మీరు ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రతలు తీసుకుంటారు ?

నా వరకూ దర్శకుడు విజన్ ని ఫాలో అవుతాను. హాయ్ నాన్న విషయానికి వస్తే నేను, మా మ్యూజిక్ టీం, దర్శకుడు శౌర్యువ్ కి ఏం కావాలో అది ఇవ్వడానికి ప్రయత్నించాం. హాయ్ నాన్న వెరీ సాఫ్ట్ రొమాంటిక్ మూవీ. సంగీతం కూడా అంతే సాఫ్ట్ గా చేశాం. మీరు బాగా పరిశీలిస్తే హాయ్ నాన్న లో లైటింగ్ విజువల్స్ మ్యూజిక్ ఇవన్నీ చాలా ఆహ్లాదకరంగా మనసుకి ప్రశాంతని ఇచ్చేలా వుంటాయి.

దర్శన, ఖుషి, సమయమా, అమ్మాడి.. ఇలా మీ పాటల్లో ఒక పదంతో హుక్ చేసే స్వభావం కనిపిస్తుంది.. దీని గురించి చెప్పండి?

సహజంగానే ఒక పదంతో పాటలోకి వెళ్ళడం నాకు ఇష్టం. ఇందులో అమ్మాడి పాట చేసినప్పుడు కూడా ముందు.. ఆ పదంపైనే దృష్టి పెట్టాను. లిరిక్స్ రైటర్స్ కి ప్రత్యేకంగా అడిగాను. అలాగే గాజుబొమ్మ, సమయమా పాటలు కూడా పదాలతోనే ముందుగా హత్తుకుంటాయి. అందరికి తెలిసిన, సహజంగా వాడుకలో వున్న ఇలాంటి పదాలతో వున్న పాటలు ఎక్కువ కాలం నిలుస్తాయని భావిస్తాను.

ఈ మధ్య కాలంలో పాటల్లో చరణాలు వుండటం లేదు కదా.. దీనిపై మీ అభిప్రాయం ?

ఇది పూర్తిగా దర్శకుడు చేతిలో వుంటుంది. హాయ్ నాన్న సినిమా గురించి చెప్పాలంటే.. లాస్ట్ వీక్ వర్క్ పూర్తి చేసినప్పటికీ ఇంకా ఈ సినిమా హ్యంగోవర్ లోనే వున్నాను. దర్శకుడు శౌర్యవ్ పాటల్ని అద్భుతంగా ప్రజంట్ చేశారు. సినిమా చూసినప్పుడు నేనే సర్ప్రైజ్ అయ్యాను. పల్లవి ఒక చోట, చరణం మనకు సర్ ప్రైజ్ ఇచ్చేలా మరోచోట చాలా అద్భుతంగా కుదిర్చారు. సమయమా పాట శైలి చాలా భిన్నంగా వుంటుంది. గాజు బొమ్మ పాటలో రెండు చరణాలు వుంటాయి. శౌర్యవ్ రెండు ఫార్మెట్స్ ని చాలా చక్కగా చూపించారు. ఇందులో ప్రతి పాటకు ప్రాముఖ్యత వుంటుంది. మ్యూజిక్ పరంగా అందుబాటులో వున్న అడ్వాన్స్ టెక్నాలజీ ని యూజ్ చేశాం.

హాయ్ నాన్న చూసినప్పుడు ఎలా అనిపించింది ?

వందకి వంద శాతం నమ్మకంతో చెబుతున్నా.. ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని ఇచ్చే చిత్రమిది. తెలుగు ప్రేక్షకులు విభిన్నమైన చిత్రాలని చూస్తారు. ఇక్కడ చాలా గొప్ప గొప్ప కథలు వచ్చాయి. అందులో హాయ్ నాన్న కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకుంటుంది. నాని గారి నటన అద్భుతంగా ఉంటుంది. నాని గారిని నేచురల్ స్టార్ అని ఎందుకు పిలుస్తారో ఈ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైయింది. అలాగే ఇందులో మృణాల్, బేబీ కియరా.. ఇలా అందరి పాత్రలు మనసుని హత్తుకునేలా వుంటాయి.

ఓడియమ్మ పాట గురించి చెప్పండి ?

కథలో ఒక పెద్ద పార్టీ సాంగ్ వుంది. ఆ విజువల్స్ మ్యాచ్ చేసే ఎనర్జిటిక్ నెంబర్ కావాలి. ఆ ఎనర్జీని పట్టుకోవడానికి కొంత సమయం పట్టింది. ఒక ట్యూన్ రికార్డ్ చేసి శౌర్యవ్ కి సెండ్ చేశాను. అది ఆయనకి చాలా నచ్చింది. మనకి కావాల్సిన ఎనర్జీ ఇదే అన్నారు. ఈ పాటని ద్రువ్ తో పాడించాలానే ఆలోచన శౌర్యవ్ దే. అలాగే శ్రుతి హసన్ గారు కూడా అద్భుతంగా పాడారు.

వైర ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్ గురించి ?

వైర ఎంటర్‌టైన్‌మెంట్ వండర్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్. ఈ సినిమా కోసం 15 మంది మ్యుజిషియన్స్ దాదాపు 40 రోజులు హైదరాబాద్ లో పని చేశాం. మరో 20 మందికి పైగా ప్లేయర్స్ రికార్డింగ్స్ లో పాల్గొన్నారు. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా చాలా గ్రాండ్ గా సినిమాని నిర్మించారు. మ్యూజిక్ అంతా హైదరాబాద్ లోనే చేశాం.

కొత్తగా చేస్తున్న చిత్రాలు?

శర్వానంద్‌ గారు, శ్రీరాం ఆదిత్య సినిమాకి చేస్తున్నాను. అలాగే రష్మిక గారి గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి పని చేస్తున్నాను.

Tags:    
  • Hinanna 
  • Nani 
  • Mrunalthakur 
  • Souryuv 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS