హిట్ డైరెక్టర్ కి హీరోలు దొరకట్లేదా..?

అది ఎందుకు దేని వల్ల అన్నది తెలియాల్సి ఉంది. నాని లాంటి స్టార్ తో సినిమా చేసిన డైరెక్టర్ శౌర్యువ్ హాయ్ నాన్నా లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చాడు.;

Update: 2025-05-05 15:49 GMT

డైరెక్టర్ గా ఒక సినిమా హిట్ పడింది అంటే వెంటనే మరో ఛాన్స్ దక్కించుకున్నట్టే లెక్క. అలా కొత్తగా వచ్చిన దర్శకులు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే చాలు వాళ్లకి వరుస అవకాశాలు వస్తాయి. ఐతే ఒక హిట్టు పడినా కూడా ఏడాది కాలంగా ఒక డైరెక్టర్ కి నెక్స్ట్ ఛాన్స్ రాలేదు. అది ఎందుకు దేని వల్ల అన్నది తెలియాల్సి ఉంది. నాని లాంటి స్టార్ తో సినిమా చేసిన డైరెక్టర్ శౌర్యువ్ హాయ్ నాన్నా లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చాడు.

దసరా తర్వాత నాని తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాడు డైరెక్టర్. హాయ్ నాన్న సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఐతే హాయ్ నాన్న తర్వాత శౌర్యువ్ సినిమా అనౌన్స్ చేయలేదు. మెగా హీరో వరుణ్ తేజ్ తో సినిమా అనుకున్నారు కానీ అది కూడా అనౌన్స్ చేయలేదు. నాని సినిమాతో డైరెక్టర్ గా మారిన శౌర్యువ్ ఛాన్స్ ఇస్తే మళ్లీ నానినే మరోసారి డైరెక్ట్ చేసేలా ఉన్నాడు.

నాని ప్యారడైజ్ పూర్తి చేయాలి.. ఆ తర్వాత సుజిత్ సినిమా ఉంది. నానితోనే చేయాలంటే సుజిత్ తర్వాత లైన్ లో ఉండాలి. ఐతే వరుణ్ తేజ్ తో సినిమా అప్డేట్ ఏంటన్నది తెలుసుకుని నెక్స్ట్ హీరో వేటలో పడేలా ఉన్నాడు డైరెక్టర్ శౌర్యువ్. హాయ్ నాన్నతోనే అతని డైరెక్షన్ టాలెంట్ ప్రూవ్ చేసుకున్న శౌర్యువ్ తప్పకుండా మరో మంచి సినిమాతో ప్రేక్షకులను మెప్పించే ఛాన్స్ ఉంది. మరి ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుంది అన్నది చూడాలి.

హాయ్ నాన్న క్లాస్ సినిమా కాబట్టి తనలో మాస్ డైరెక్టర్ కూడా ఉన్నాడని ప్రూవ్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నాడు శౌర్యువ్. సో హాయ్ నన్నా ఫ్యాన్స్ కి ఆ డైరెక్టర్ నుంచి త్వరలోనే ఒక అనౌన్స్ మెంట్ రాబోతుందని తెలుస్తుంది. ఈసారి ఈ డైరెక్టర్ ఎలాంటి కథతో వస్తాడన్నది చూడాలి. హిట్ ఇచ్చినా కూడా ఇప్పటివరకు మూవీ మొదలు కాలేదు అంటే రెండో ప్రయత్నం కూడ శౌర్యువ్ భారీగానే వేస్తున్నాడని అర్థమవుతుంది. ఐతే ఆ ప్రాజెక్ట్ డీటైల్స్ మాత్రం బయటకు రాలేదు. శౌర్యువ్ తో సినిమా చేయాలని యువ హీరోలు అంతా కూడా ఆసక్తిగా ఉన్నారని తెలుస్తుంది. మరి ఆ ఛాన్స్ ఎవరికో చూడాలి.

Tags:    

Similar News