• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హ‌రి హ‌ర ..కింగ్‌డ‌మ్...

హ‌రి హ‌ర ..కింగ్‌డ‌మ్ ఏంటీ నాన్నా పులి ఆట‌?

| పార్ట్ 1 మ‌రోసారి వాయిదా ప‌డింద‌ని, జూన్ 28న రిలీజ్ చేస్తున్నామ‌ని, ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ పోస్ట్ చేయ‌డంతో అంతా అవాక్క‌య్యారు.

By - Tupaki Desk
Update: 2025-06-10 05:31 GMT

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`.17వ శ‌తాబ్దం నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో ప‌వ‌న్ రాబిన్ హుడ్ త‌ర‌హాలో సాగే గ‌జ‌దొంగ‌గా క‌నిపించ‌నున్నారు. మొఘ‌ల్ సామ్రాజ్యం నాటి పీరియాడిక్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాని జూన్ 12న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నామంటూ ఇటీవ‌ల టీమ్ ప్ర‌క‌టించింది. క్రిష్‌తో పాటు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రిలీజ్ మ‌రోసారి వాయిదా ప‌డటం ప‌వ‌న్ అభిమానుల్ని క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది.

పార్ట్ 1 మ‌రోసారి వాయిదా ప‌డింద‌ని, జూన్ 28న రిలీజ్ చేస్తున్నామ‌ని, ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ పోస్ట్ చేయ‌డంతో అంతా అవాక్క‌య్యారు. దీనిపై `హ‌రి హ‌ర టీమ్ స్పందించింది. ఈ ప్ర‌చారంలో నిజం లేద‌ని తేల్చి చెప్పింది. ఆ పోస్ట్‌ల‌ని న‌మ్మ‌కండ‌ని, మా సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌ని అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఆల‌స్యం కావ‌డం వ‌ల్లే `హ‌రి హ‌ర విడుద‌ల మరోసారి వాయిదా ప‌డిన‌ట్టుగా తెలుస్తోంది.

ఇక దీనితో పాటు వాయిదా ప‌డుతున్న మూవీ `కింగ్‌డ‌మ్‌`. రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన భారీ పాన్ ఇండియా మూవీ `కింగ్ డ‌మ్‌`. గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్ట్ చేస్తున్నాడు. భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీలో స‌త్య‌దేవ్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ కోసం గ‌త కొన్ని నెలుల‌గా రౌడీ ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. `లైగ‌ర్‌` త‌రువాత రౌడీ సైలెంట్ అయిపోవ‌డంతో ఈ మూవీతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి రావాల‌ని బ‌లంగా కోరుకుంటున్నారు.

అయితే ఈ సినిమా కూడా వ‌రుస‌గా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ముందు ఈ మూవీని మార్చి 28న రిలీజ్ చేస్తామ‌ని టీమ్ ప్ర‌క‌టించింది. కానీ అది జ‌ర‌గ‌లేదు. ఇక రీసెంట్‌గా జూలై 4న రిలీజ్ చేస్తున్నామంటూ మ‌రో డేట్‌ని ప్ర‌క‌టించింది. కానీ ఇప్పుడు ఆ డేట్‌న కూడా `కింగ్‌డ‌మ్ వ‌చ్చే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. అదే రోజు నితిన్ `త‌మ్ముడు` రిలీజ్‌కు రెడీ అవుతుండ‌టంతో `కింగ్‌డ‌మ్‌` జూలై 4న రిలీజ్ అయ్యే ఛాన్సే లేద‌నే వాద‌న వినిపిస్తోంది.

`త‌మ్ముడు` జూలై 4న రిలీజ్ కానున్న నేప‌థ్యంలో `కింగ్‌డ‌మ్‌`ని జూలై 25కు పోస్ట్ పోన్ చేయ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు, కింగ్‌డ‌మ్ సినిమాల రిలీజ్‌ల కోసం ఎదురు చూస్తున్న అభిమానులు, సినీ ల‌వ‌ర్స్ ఏంటీ నాన్నా పులి ఆట‌? అని వాపోతున్నారు. ఈ త‌ర‌హాలో ఏ సినిమాలు వాయిదా ప‌డ‌లేద‌ని, ఈ రెండు సినిమాల‌కే ఎందుకు ఇలా జ‌రుగుతోంద‌ని అభిమానులు ఫీల్ అవుతున్నార‌ట‌. మ‌రి ఈ విష‌యం మేక‌ర్స్ గ‌మ‌నిస్తున్నారో లేదో.

Tags:    
  • HariHaraVeeraMallu 
  • KingdomMovie 
  • PawanKalyan 
  • VijayDeverakonda 
  • TollywoodDelays 
  • ReleasePostponed 
  • PanIndiaMovies 
  • FansDisappointed 
  • Krish 
  • GowtamTinnanuri 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS