• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హఠాత్తుగా అక్కడ...

హఠాత్తుగా అక్కడ దర్శనమిచ్చిన నటి హేమ

| ఆమె బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొని వివాదంలో చిక్కుకుందని తెలిసిన సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-06-28 11:22 GMT

క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఇటీవల జరిగిన రేవ్ పార్టీ వివాదంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఆ కేసుపై రకరకాలుగా వార్తలు రాగా ఆమె ఎప్పటికప్పుడు స్పందించే ప్రయత్నం అయితే చేశారు. ఇక ఇన్ని రోజులు కేసుల విషయంలో బిజీగా ఉన్న ఆమె, కొంత గ్యాప్ తర్వాత తాజాగా తిరుమలలో కనిపించారు. ఆమె బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొని వివాదంలో చిక్కుకుందని తెలిసిన సంగతి తెలిసిందే.

రేవ్ పార్టీలో పాల్గొనడం, డ్రగ్స్ తీసుకున్నట్టు ఆరోపణలు రావడంతో, హేమ కొంతకాలం వార్తల్లో నిలిచింది. ఇక హేమ నేడు ఉదయం తిరుమలలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని, స్వామి వారి కృపతో తనకు కొత్త శక్తి లభించిందని పేర్కొంది. తిరుమలలో హేమ దర్శనం చేసుకున్న వెంటనే, ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, ఇక పలువురు అభిమానులు హేమతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు.

మీడియాతో మాట్లాడిన హేమ, స్వామి వారి దర్శనం చాలా సంతృప్తిగా జరిగిందని తెలిపింది. "నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడికి రాగానే నా పుట్టిల్లు వచ్చినట్టే అనిపిస్తుంది," అని చెప్పింది. రేవ్ పార్టీ వివాదం గురించి మీడియా ప్రశ్నించగా, హేమ ఆ విషయం లో పెద్దగా రియాక్ట్ కాలేదు. కేవలం, "మీరు వార్తలు రాస్తున్నారు కదా, మీకే తెలియాలి," అని సమాధానమిచ్చింది.

ఇక హేమ కెరీర్ గురించి చెప్పాలంటే, ఆమె తెలుగు సినిమా పరిశ్రమలో తన నటన తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో ప్రముఖ సినిమాల్లో నటించి, తన సహజమైన అభినయం ద్వారా ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఆమె చేసిన కొన్ని ప్రాముఖ్యత కలిగిన పాత్రలు ప్రేక్షకులపై ముద్ర వేసాయి. ముఖ్యంగా మిర్చి, జులాయి లాంటి సినిమాల్లో ఆమె చేసిన రోల్స్ బాగా హైలెట్ అయ్యాయి.

తన కెరీర్ ప్రారంభంలో హేమ కేవలం చిన్న పాత్రలలో నటించేది. కానీ తన అభినయంతో ఆ పాత్రలను మెమొరబుల్‌గా మార్చేసేది. ముఖ్యంగా కామెడీ పాత్రల్లో తన టైమింగ్‌, హాస్యాన్ని చక్కగా పలికిస్తూ, ప్రేక్షకులను నవ్వించేది. తరువాత ఆమెను మరింత గుర్తించి, ప్రధాన పాత్రలు ఇవ్వడం ప్రారంభమైంది. ఇక హేమ ప్రస్తుత వివాదం తరువాత మీడియా ముందు రావడం, తిరుమలలో దర్శనం చేసుకోవడం, తన జీవితంలో మళ్ళీ కొత్త శక్తిని సంతరించుకోవడం, ఆమె భవిష్యత్తు ప్రయాణంలో కీలకంగా మారింది. మరి ఆమెకు ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • Filmindustry 
  • Hema 
  • RaveParty 
  • Drugscase 
  • LordVenkateswaraSwamiTemple 
  • Tirumala 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS