67 పాటలపై నిషేధం..CM రేవంత్ ఉక్కుపాదం?
తాజాగా అందిన సమాచారం మేరకు మొత్తం 67 పాటలపై హర్యానా పోలీసుల నిషేధం విధించడం సంచలనంగా మారింది.;
యువతపై దుష్ప్రభావం చూపేలా, ముఖ్యంగా గన్ కల్చర్, మాదకద్రవ్యాలు , గ్యాంగ్‌స్టర్ జీవనశైలిని ప్రోత్సహించే పాటలపై ప్రభుత్వం, న్యాయస్థానాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ తరహా విశృంఖల కల్చర్ కి కేరాఫ్ గా ఉండే పంజాబ్ లో పోలీస్ వ్యవస్థ చాలా సీరియస్ నిర్ణయాలతో షాక్ లిస్తోంది.
తాజాగా అందిన సమాచారం మేరకు మొత్తం 67 పాటలపై హర్యానా పోలీసుల నిషేధం విధించడం సంచలనంగా మారింది. ఇప్పటికే వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుండి ఈ పాటలను తొలగించారు. ఇవి గ్యాంగ్ కల్చర్‌ను గొప్పగా చూపించడం, ఆయుధాలను ప్రదర్శిస్తూ హింసను ప్రేరేపించేలా ఉన్నాయని పోలీస్ శాఖ నిర్ధారించింది. దీంతో వెంటనే కఠిన చర్యలు మొదలయ్యాయి. కేవలం పాటలను తొలగించడమే కాకుండా, అటువంటి కంటెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసే లేదా లైక్ చేసే యూజర్లపైనా నిఘా ఉంచుతామని పోలీసులు హెచ్చరించారు.
ఇకపై నో ఛాన్స్..
ఆపరేషన్ ట్రాక్‌డౌన్ పేరుతో యువత నేరాల వైపు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు హర్యానా డీజీపీ అజయ్ సింఘాల్ ఈ ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని ప్రైవేట్ ఎఫ్.ఎమ్ రేడియో ఛానళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మద్యం, డ్రగ్స్, ఆయుధాలు, గన్ కల్చర్‌ను ప్రోత్సహించే పాటలను ప్రసారం చేయకూడదని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే సదరు ఛానల్ లైసెన్స్‌ను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని హెచ్చరించింది.
అరాచకాలు తగ్గాలని..
పంజాబ్, హర్యానా హైకోర్టు గతంలోనే ఈ అంశంపై సీరియస్ అయింది. పాటల్లో హింసను గొప్పగా చూపించడం వల్ల చిన్నారులు, యువతపై తీవ్రమైన దుష్ప్రభావం పడుతోంది. ఇది సమాజంలో గ్యాంగ్‌స్టర్ కల్చర్ పెరగడానికి దారితీస్తోందని కోర్టు అభిప్రాయపడింది. బహిరంగ సభలు, పెళ్లిళ్లు, విద్యా సంస్థల్లో ఇటువంటి పాటలను ప్లే చేయడంపై నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
తెలంగాణ- ఏపీలోను ఈ ఉద్యమం?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డ్రగ్స్, గ్యాంగ్‌స్టర్ కల్చర్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నారు. హర్యానా తరహాలోనే ఇక్కడ కూడా యువతను తప్పుదోవ పట్టించే పాటలు, కంటెంట్‌పై నియంత్రణలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో ఇలాంటి నిషేధం అమల్లోకి వస్తే, దానిని ఏపీలో కూడా అమల్లోకి తెచ్చే అవకాశం లేకపోలేదు.
పక్కదారి పట్టించకూడదు:
సినిమాలు, పాటలు కేవలం వినోదం కోసం మాత్రమే ఉండాలి, అవి సమాజాన్ని పక్కదారి పట్టించేవిగా ఉండకూడదు! అనేది ప్రభుత్వాల ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వంటి వాటిలో ఇటువంటి పాటల ప్రభావం ఎక్కువగా ఉండటంతో సైబర్ క్రైమ్ పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారు. కళ పేరుతో స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే ఇకపై ప్రభుత్వాలు, పోలీసుల నుంచి చర్యలు తప్పవని తాజా పరిణామాలు చెబుతున్నాయి.