హరీష్ శంకర్ మరోసారి వేసేశారు..!
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ మైక్ దొరికితే చాలు తను చెప్పాలనుకున్న పాయింట్ స్ట్రైట్ గా చెప్పేస్తుంటారు.;
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ మైక్ దొరికితే చాలు తను చెప్పాలనుకున్న పాయింట్ స్ట్రైట్ గా చెప్పేస్తుంటారు. లాస్ట్ ఇయర్ మిస్టర్ బచ్చన్ సినిమా చేసిన హరీష్ శంకర్ నెక్స్ట్ సినిమా ఏంటన్నది ఇంకా క్లారిటీ రాలేదు. మరోపక్క పవన్ కళ్యాణ్ తో మొదలు పెట్టిన ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు మళ్లీ షూటింగ్ స్టార్ట్ అవుతుందో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో హరీష్ శంకర్ ఎక్కువగా సినిమా ఫంక్షన్స్ కి అటెండ్ అవుతున్నారు.
తనని పిలవాలే కానీ ప్రతి ఈవెంట్ కి వచ్చి చిత్ర యూనిట్ ని ఎంకరేజ్ చేస్తున్నాడు. డ్రాగన్ సినిమా ఈవెంట్ లో మనందరికీ అలవాటే కదా పక్క వాళ్ల సినిమాలకు ఎగేసుకుని వెళ్లడం ఆ సినిమాలను హిట్ చేయడం అని అన్నారు. ఆ టైం లో చాలామంది నా కామెంట్స్ కి ఎటాక్ చేశారు. కానీ జింఖానా ఈవెంట్ లో కూడా అదే చెబుతున్నా పక్క సినిమాలకు ఎగేసుకు వెళ్లడం అలవాటే కదా ఈ సినిమాను కూడా అలానే హిట్ చేయండని అన్నారు.
ఈ కామెంట్స్ పై ఎవరేం అనుకున్నా పర్వాలేదని అన్నారు హరీష్ శంకర్. డైరెక్టర్ హరీష్ శంకర్ ఎప్పుడు ఇలానే ఏదో ఒక స్టేట్ మెంట్ తో సెన్సేషనల్ గా సృష్టిస్తారు. ఐతే లేటెస్ట్ గా జింఖానా ఈవెంట్ లో ఇదివరకు అన్న కామెంట్ నే మళ్లీ చెబుతూ ఈసారి కూడా ఎవరేం అనుకున్నా పర్వాలేదని అనడం ఆశ్చర్యకరంగా మారింది.
తెలుగు ప్రేక్షకులు అన్ని సినిమాలను ఆదరిస్తారు అలా మంచి కంటెంట్ ఉన్న సినిమాను ఏదైనా మన వాళ్లు హిట్ చేస్తారు. హరీష్ శంకర్ చెప్పే కామెంట్స్ కూడా దాదాపు ఇలాంటివే కానీ ఆయన తన మార్క్ కామెంట్స్ తో వాటిని చెప్పేసరికి కాస్త డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. ప్రేమలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నెస్లెన్ హీరోగా తెరకెక్కిన జింఖానా సినిమా ఈ నెల 25న రిలీజ్ అవుతుంది.
ఖలీద్ రెహమాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేసింది. హరీష్ శంకర్ చెప్పాడని కాదు సినిమాలో విషయం ఉంటే తప్పకుండా అది ఏ భాష సినిమా అయినా తెలుగు ప్రేక్షకులు సక్సెస్ చేస్తారు. మరి ఈ జింఖానా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.