ఉస్తాద్ తర్వాత రవితేజతో సినిమా.. హరీశ్ శంకర్ రెస్పాన్స్ ఇదే

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కిస్తున్నారు.;

Update: 2025-08-10 10:29 GMT

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. కొన్నిరోజులుగా వాయిదా పడ్డ ఈ ప్రాజెక్ట్ ఇటీవల మళ్లీ పునః ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ కొనసాగుతోంది. తుది దశ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ముగుస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత దర్శకుడు హరీశ్ శంకర్ కొత్త కథ రెడీ చేశారని ప్రచారం సాగుతోంది.

అయితే ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత హరీశ్ మాస్ మహారాజ రవితేజతో తెరకెక్కించనున్నారని, ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు రూపొందించనున్నారని ప్రచారం సాగింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో సినిమా చేయనున్నాడని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఇలా హరీశ్.. ఈ సినిమా పూర్తవ్వగానే.. ఈ రెండింట్లో ఏదో ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తాడని కథనాలు వచ్చాయి.

తాజాగా హరీశ్ ఈ వార్తలపై స్పందించాడు. ఇవన్నీ పుకార్లేనని కొట్టిపారేశాడు. తన రాబోయే చిత్రంపై వస్తున్న అన్ని పుకార్లను తోసిపుచ్చుతూ.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి స్వయంగా అధికారికంగా పంచుకుంటానని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. నా తదుపరి ప్రాజెక్ట్ గురించి వస్తున్న వివిధ వార్తలన్నీ పూర్తిగా ఊహాజనితమైనవే. నేను అధికారిక ప్రకటన ద్వారా సరైన సమయంలో వివరాలను వ్యక్తిగతంగా పంచుకుంటాను. ప్రస్తుతానికి నేను, నా టీమ్ పూర్తిగా ఉస్తాద్ భగత్ సింగ్ తో బిజీగా ఉన్నాము అని క్లారిటీ ఇచ్చేశాడు.

కాగా, ఉస్తాద్ షూటింగ్ పనులు చివరి దశకు వచ్చేశాయి. జూలై 29న, క్లైమాక్స్ సన్నివేశాలు కూడా షూటింగ్ పూర్తి చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. భావోద్వేగాలు, యాక్షన్‌ తో కూడిన అద్భుతమైన క్లైమాక్స్ సన్నివేశం నబకాంత మాస్టర్ పర్యవేక్షణలో పూర్తయ్యింది. అని నిర్మాణ సంస్థ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇటీవల ప్రకటన చేసింది. త్వరలోనే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి.

పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ.. ఈ సినిమాకు కూడా టైమ్ కేటాయిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీసుగా కనిపించనున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని మరియు వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News