తథాస్తు పోస్ట్.. అసలేం జరిగిందో చెప్పిన హరీష్ శంకర్..
అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించినది కావడంతో ఆ రిప్లై కాంట్రవర్సీగా మారింది. దీంతో ట్రోల్స్ ఎదుర్కొన్న హరీష్ శంకర్.. తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు.;
పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న వేళ.. డైరెక్టర్ హరీష్ శంకర్ పొరపాటుగా పెట్టిన ఓ రిప్లై సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించినది కావడంతో ఆ రిప్లై కాంట్రవర్సీగా మారింది. దీంతో ట్రోల్స్ ఎదుర్కొన్న హరీష్ శంకర్.. తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు.
నిజానికి బుధవారం ఉదయం సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేసి.. తాను కావాల్సి చేయలేదని తెలిపారు. ఆ తర్వాత ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో ఆ విషయంపై మాట్లాడారు. తథాస్తు అంటూ పెట్టిన ఒక్క రిప్లై.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయిందని హోస్ట్ ప్రస్తావించారు. దీంతో హరీష్ శంకర్ స్పష్టతనిచ్చారు.
"మొన్న నైట్ అంతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ట్రైలర్ వర్క్స్ జరిగాయి.. రాత్రంతా పడుకోలేదు. నిన్న ఉదయం సెన్సార్ మీటింగ్ జరిగిన తర్వాత పెద్దమ్మ తల్లి గుడిలో పూజలు, భోజనాలు అయ్యాయి. ఆ తర్వాాత సాంగ్ ప్రోమో లాంఛ్ జరిగింది. అయితే ఓ రీల్ చెక్ చేసుకోవడానికి.. తమన్ త్వరగా రమ్మని చెబుతూ తొందర పెట్టాడు. కారులో వెళ్ళినప్పుడు.. ప్రోమో లాంఛ్ అయిపోయింది. అప్పుడు సాంగ్ రెస్పాన్స్ ఏంటని చూశా.. అందరికీ ఫీడ్ బ్యాక్ ఇచ్చా..అలా తమన్ వద్దకు వచ్చా.. లిఫ్ట్ దగ్గర ఉన్నప్పుడు మొత్తం ట్వీట్ చదవకుండా తథాస్తు అంటూ కోట్ చేశా" అని తెలిపారు.
"లిఫ్ట్ లో పైకి వెళ్లే లోపే పీఆర్ టీమ్ మొత్తం చదవలేదా అని అడిగింది. వెంటనే చూసి 30 సెకెన్స్ లో రిప్లై డిలీట్ చేశా.. ఆ తర్వాత మహేష్ ఫ్యాన్స్ తో టచ్ లోకి వెళ్లా. కానీ రిప్లైస్ డిలీట్ అయ్యాయి. అందుకే అందరికీ మార్నింగ్ నీట్ గా అర్థం అవ్వాలని సారీ చెప్పా. అయితే గద్దలకొండ గణేష్ సక్సెస్ అవ్వగానే మహేష్ బాబు గారు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. అప్పుడు నేను వెళ్లి నేరుగా కలిశా. చాలా ఫ్రెండ్లీగా నాతో గడిపారు" అని చెప్పారు.
."అంతకుముందు ఓ ఈవెంట్ లో కలిసి బాగా తగ్గిపోయావేంటి అని అన్నారు. అన్నిట్లో తగ్గా అని చెప్పా.. పగలబడి కాసేపు నవ్వారు. అంత పెద్ద హీరో మనతో సరదాగా ఉండడం గ్రేట్. అలాంటి వ్యక్తిపై నేను కామెంట్ చేస్తే కళ్ళు పోవా? బుర్ర ఉన్న వాళ్ళు ఎవరైనా అలా చేస్తారా? చూడకుండా రిప్లై పెట్టా. అందుకే మహేష్ బాబు గారికి, ఫ్యాన్స్ కు సారీ చెప్పా. ట్రోల్ చేస్తారని తెలిసినా కామెంట్స్ హోల్డ్ చేయలేదు.తిట్టినా కోపం తగ్గుతుందని అనుకున్నా.. ఒక డైరెక్టర్ గా నేను ఆయనకు అభిమాని. ఆయన కామిక్ టైమింగ్ ను ఎవరూ మ్యాచ్ చేయలేరు" అంటూ మహేష్ పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.