• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ధర్మం కోసం వీరమల్లు...

ధర్మం కోసం వీరమల్లు యుద్ధం.. పవర్ఫుల్ సర్ ప్రైజ్!

| పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-04-17 04:58 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా షూటింగ్ చాలాసార్లు వాయిదా పడింది. పవన్ ఫ్యాన్స్ లో ఒక వర్గం వారు ఈ సినిమా కోసమైతే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే కారణాలు బలంగా తెలియకపోయినా సినిమాను మాత్రం పర్ఫెక్ట్ గా తెరపైకి తీసుకురావడానికి పవన్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.


దర్శక నిర్మాతలు కూడా అదే తరహాలో ప్లాన్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. మరొకవైపు పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడం వలన కూడా ఈ సినిమా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. ఇక సినిమా ఆగిపోయింది అని చాలాసార్లు రకరకాల గాసిప్స్ వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదు అని నిర్మాత AM రత్నం ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వస్తున్నారు.

ఇక హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన మరొక అప్డేట్ ను కూడా ఇవ్వడం విశేషం. నేడు శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేకంగా ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. జై శ్రీరామ్ - శ్రీరామ నవమి శుభాకాంక్షలు - మీ ముందుకు.. 'ధర్మం కోసం యుద్ధం' త్వరలో.. అంటూ ఒక అద్భుతమైన పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ ను కత్తిలాంటి చూపులతో హైలెట్ చేశారు.

చూస్తుంటే సినిమాలో పవన్ గతంలో ఎప్పుడూ లేనంత పవర్ ఫుల్ గా కూడా కనిపించబోతున్నట్లు అర్థమవుతుంది. ఈ సినిమాను చారిత్రాత్మక నేపథ్యంలో తెరపైకి తీసుకువస్తున్నారు. హీరో క్యారెక్టర్ కూడా మూడు విభిన్నమైన షేడ్స్ లో ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా యాక్షన్ ఎలివేషన్స్ కూడా మామూలుగా ఉండవని ఇదివరకే క్లారిటీ వచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఈ సినిమా కోసం శిక్షణ కూడా తీసుకున్నాడు ఇక సినిమా షూటింగ్ అయితే ఎలక్షన్స్ తర్వాత మళ్లీ రీస్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.

ఇప్పటికే దర్శకుడు సగం వరకు షూటింగ్ పూర్తి చేశాడు. ఇక మిగిలిన భాగాన్ని ఎంత త్వరగా పూర్తి చేస్తారో చూడాలి. ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా హిందీ తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో కూడా హరిహర వీరమల్లు విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాలో బాబీ డియోల్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు. నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నటిస్తోంది. ఇక ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

Tags:    
  • Pawankalyan 
  • Hariharaveeramallu 
  • Krish 
  • Keeravani 
  • Nidhiagarwal 
  • Sriramanavami 
  • Panindiaproject 
  • Amratnam 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS