పవన్ 'వీరమల్లు'.. యూఎస్ ప్రీమియర్స్ సేల్స్ లెక్కలు ఇలా!

తద్వారా నార్త్ యూఎస్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన బడా సినిమాల లిస్ట్ లో ఏడో ప్లేస్ లో ఉంది. ఆ సినిమా కన్నా ముందు ఏ చిత్రాలు ఉన్నాయంటే..;

Update: 2025-07-23 16:10 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన హరిహర వీరమల్లు మూవీ ప్రీమియర్ షోల రూపంలో మరికొద్ది గంటల్లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా విడుదల కానున్న ఆ సినిమాలో పోరాట యోధుడిగా నెవ్వర్ బిఫోర్ లుక్ లో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు.

పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఆ మూవీలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఔరంగజేబు రోల్ లో కనిపించనున్నారు. అనుపమ్ ఖేర్, సత్యరాజ్, సునీల్, నాజర్, జిష్ణు సేన్ గుప్తా, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎం ఎం కీరవాణి మ్యుజిక్ అందించారు.

ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై దయాకరరావు వీరమల్లు మూవీని నిర్మించగా.. బుధవారం రాత్రి 9 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ పడనున్నాయి. ఇండియన్ టైమింగ్ ప్రకారం... రాత్రి 8.45 గంటలకు అమెరికాలో ప్రీమియర్ షోస్ పడునున్నాయి. ఇప్పటికే అక్కడ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.

అయితే నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ ఫైనల్ అడ్వాన్స్ సేల్స్ 56 వేల డాలర్లకు పైగా వసూళ్లను హరిహర వీరమల్లు సాధించినట్లు తెలుస్తోంది. తద్వారా నార్త్ యూఎస్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన బడా సినిమాల లిస్ట్ లో ఏడో ప్లేస్ లో ఉంది. ఆ సినిమా కన్నా ముందు ఏ చిత్రాలు ఉన్నాయంటే..

కల్కి2898 ఏడీ - 2.77 మిలియన్ డాలర్లు($3.05M)

దేవర - 2.38 మిలియన్ డాలర్లు ($2.51M)

పుష్ప2 - 2.28 మిలియన్ డాలర్లు ($2.5M)

సలార్ - 1.8 మిలియన్ డాలర్లు ($1.95M)

గుంటూరుకారం - 1.06 మిలియన్ డాలర్లు ($1.2M)

గేమ్ ఛేంజర్ - 657K డాలర్లు ($740K)

హరిహర వీరమల్లు - 503K* ($565K)

అయితే ఇప్పటి వరకు నార్త్ యూఎస్ లో అత్యధిక సార్లు $500k+ ప్రీమియర్ గ్రాసర్స్ సాధించిన హీరోల్లో లిస్ట్ లో పవన్ ఐదో స్థానంలో ఉన్నారు. మహేష్ బాబు.. తొమ్మిది సినిమాలతో టాప్ ప్లేస్ ను కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రభాస్, ఎన్టీఆర్, చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ సహా పలువురు హీరోలు ఉన్నారు. ఏ హీరో ఎన్ని సినిమాలతో ఆ ఫీట్ సాధించారంటే..

మహేష్ బాబు - 9

ప్రభాస్- 7

ఎన్టీఆర్ - 5

పవన్ కళ్యాణ్ - 5*

చిరంజీవి - 4

అల్లుఅర్జున్ - 3

రామ్ చరణ్ - 3

బాలకృష్ణ - 3

నాని - 3

విజయ్ దేవరకొండ - 1

Tags:    

Similar News