వీరమల్లు కొత్త రిలీజ్ తేదీ ఇదేనా?
'హరి హర వీరమల్లు' వాయిదా మరోసారి పవన్ కళ్యాణ్ అభిమానులకు తీవ్ర నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే.;

'హరి హర వీరమల్లు' వాయిదా మరోసారి పవన్ కళ్యాణ్ అభిమానులకు తీవ్ర నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎలాంటి వాయిదాలు లేకుండా జూన్ 12న రిలీజ్ పక్కా? అని సంబరాలకు సిద్దమవుతోన్న సమయంలో వాయిదా వార్త వెల్లడించడంతో అభిమానుల గుండెల్లో పిడుగు పడినంత పనైంది. దీంతో నిరుత్సాహానికి గురయ్యారు. మళ్లీ రిలీజ్ ఎప్పుడు? అంటూ ఎదురు చూసే ఆసక్తి కూడా తగ్గింది.
చాలా మంది అభిమానులు రిలీజ్ అయినప్పుడు చూసుకుందాంలే? అనే నిర్ణయానికి వచ్చేసారు. రిలీజ్ వాయిదాకి కారణం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతోనే వాయిదా పడింది. మరి ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయి? అంటే ఇంకా క్లారిటీ లేదు. మరి రిలీజ్ ఎప్పుడు ఉండొచ్చు? అంటే చిత్ర వర్గాల నుంచి జులై 15 తర్వాత ఉంటుందని లీకులందుతున్నాయి. వచ్చే నెల 5 కల్లా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తవుతుందని...ఆ తర్వాత సెన్సార్ సహా ఇతర అన్ని రకాల పార్మాల్టీస్ పూర్తి చేయడానికి మరో వారం పది రోజులు సమయం పడుతుందంటున్నారు.
అటుపై కొత్త రిలీజ్ తేదీపై నిర్మాతలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందంటున్నారు. అయితే ఈసారి మాత్రం కోయిల ముందే కూసినట్లు కాకుండా? అన్ని రకాలుగా ఆలోచించుకునే రిలీజ్ తేదీని ప్రకటించాలని బలంగా నిర్ణయించు కున్నారట. అభిమానుల అటెన్షన్ కోసం ఎలాంటి ప్రకటనలు అధికారికంగా బయటకు రాకుండా చూసుకోవాలని టీమ్ కు నిర్మాత రత్నం గట్టిగానే చెప్పారట.
ఇక్కడ మరో విశేషం ఏంటంటే? రిలీజ్ తేదీని బట్టి పబ్లిసిటీని ముందే ప్లాన్ చేసుకోవాలి. ఆ విషయాన్ని ఎంతో ప్రీప్లాన్డ్ గా పవన్ కు చెప్పాలి. లేదంటే? ఆయన డేట్లతో క్లాష్ ఏర్పడుతుంది. ఇప్పటికే ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఓవైపు పెండింగ్ పూర్తి చేయడం మరోవైపు డీసీఎం బాధ్యతలు చూసుకుంటున్నారు. కాబట్టి ఈ సారి రిలీజ్ తేదీ మాత్రం కంగారు లేకుండా పవన్ ప్రచారం కోసం ఇచ్చే డేట్ల వెసులు బాటును బట్టి రిలీజ్ తేదీని ప్రకటించే అవకాశం ఉంది.