• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హరిహర వీరమల్లు.. ఈ రిలీజ్...

హరిహర వీరమల్లు.. ఈ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లే!

| పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ ఆలస్యం గత కొన్నేళ్లుగా అభిమానులను నిరాశపరిచింది

By - Tupaki Desk
Update: 2025-05-07 06:17 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ ఆలస్యం గత కొన్నేళ్లుగా అభిమానులను నిరాశపరిచింది. 2020లో మొదలైన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, కోవిడ్ మహమ్మారి, పవన్ రాజకీయ బాధ్యతల కారణంగా ఎన్నోసార్లు వాయిదా పడింది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. క్రిష్ జగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 17వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో సాగుతుంది.

ఫైనల్ గా ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్ తన షూటింగ్‌ను పూర్తి చేశాడు. ఐదు రోజుల్లో ముగియాల్సిన వర్క్‌ను కేవలం రెండు రోజుల్లోనే ఫినిష్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వేగంతో సినిమా నిర్మాణం ముగిసినట్లు టీమ్ ప్రకటించింది. ఈ సినిమా కోసం ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, నిధి అగర్వాల్, బాబీ డియోల్, నర్గీస్ ఫాఖ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏదేమైనా ఫైనల్ గా షూటింగ్ వార్త అభిమానుల్లో జోష్ నింపింది.

మొదట సినిమాను సమ్మర్ మధ్యలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. మే 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా, అది కుదరలేదు. ఆ తర్వాత మే 30న రిలీజ్ చేయాలని భావించినా, ఆ డేట్ కూడా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు జూన్‌లో కచ్చితంగా రిలీజ్ చేయాలని టీమ్ ఫిక్స్ అయింది. ఈ సినిమా సమ్మర్ ఎండింగ్ లో అభిమానులకు పెద్ద ట్రీట్‌గా నిలవనుంది.

ప్రస్తుతం నిర్మాత ఎ.ఎం. రత్నం ప్లాన్ ప్రకారం, సినిమా రిలీజ్ డేట్ జూన్ 12గా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇదివరకే ఎప్పటికప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫినిష్ చేసిన టీమ్, ఇప్పుడు పవన్ డబ్బింగ్ చెప్పే పనిని పూర్తి చేస్తే, జెట్ స్పీడ్‌లో మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫినిష్ అవుతుందని అంటున్నారు.

ఈ సినిమా కోసం భారీ సెట్స్, VFX వర్క్ ఆడియన్స్‌ను ఆకర్షించేలా ఉంటాయట. రానున్న రోజుల్లో సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగనున్నాయి. కొత్త సాంగ్స్, మరికొన్ని టీజర్స్, రెండు ట్రైలర్స్‌తో ప్రమోషనల్ ప్లాన్ కొనసాగనుంది. ఈ సినిమా పవన్ ఫ్యాన్స్‌కు జూన్ 12న పెద్ద పండగ కాబోతుంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Tags:    
  • HariHaraVeeraMallu 
  • PawanKalyan 
  • PowerStar 
  • KrishJagarlamudi 
  • IndianCinema 
  • June12Release 
  • BigScreenEpic 
  • MMKeeravani 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS