• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీరమల్లు.. సర్‌ప్రైజ్...

వీరమల్లు.. సర్‌ప్రైజ్ లతోనే అసలు ప్లానింగ్

| పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-01-29 09:16 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. మొఘల్ యుగం నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా, పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ సినిమా చాలా.కాలంగా సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. ఇక చిత్రబృందం, తాజాగా అభిమానులను ఉత్సాహపరిచే అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది.


మాట వినాలి పాటతో పవన్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చారు. అలాగే పవన్ ఆ పాటను పాడడం విశేషం. ఇక BTS వీడియోను కూడా రిలీజ్ చేశారు. మేకర్స్ నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం, ఇకపై ప్రతి 15 రోజులకు ఒక కొత్త ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన మాట వినాలి పాట ప్రోమో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది.

పాట ప్రోమోలో పవన్ కళ్యాణ్ స్టైల్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే మరో సాంగ్‌ను త్వరలోనే విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే, అంతటితో ఆగకుండా ఇకపై సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ను రెగ్యులర్‌గా అందించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారని తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం, రాబోయే రెండు వారాల్లో మరో సాంగ్ విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈసారి మాస్ ఎలిమెంట్స్‌ను హైలైట్ చేసే గ్రాండ్ విజువల్ ట్రీట్‌ను అందించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ పాటను పవన్ కళ్యాణ్, పూజిత మోహన్‌లపై అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించినట్లు సమాచారం. ఆల్రెడీ ఈ పాట షూటింగ్‌ను గ్రాండ్‌గా కంప్లీట్ చేసిన టీమ్, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక సినిమా విడుదల తేదీపై అనుమానాలు కొనసాగుతున్న నేపథ్యంలో అప్డేట్స్ ఇస్తూ ఒక క్లారిటీ ఇస్తున్నారు. హరి హర వీరమల్లును మొదట ఏప్రిల్ 2023లో విడుదల చేయాలని భావించినా, పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కాగా, మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీంతో సినిమా మార్చి 28న విడుదల అవుతుందని పోస్టర్స్ ద్వారా చెబుతున్నారు.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ గొప్ప యోధుడి పాత్రలో కనిపించనుండగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రధాన ప్రతినాయక పాత్రలో కనిపించబోతున్నాడు. మొఘల్ సామ్రాజ్య కాలం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అత్యున్నత స్థాయి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఉండనున్నాయని తెలుస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు

Full View
Tags:    
  • Pawankalyan 
  • Hariharaveeramallu 
  • Maatavinaalisong 
  • Btsvideo 
  • Amrathnam 
  • Keeravani 
  • Tollywood 
  • Filmindustry 
  • Bobbydeol 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS