వీరమల్లు రెండు భారీ వేడుకలు!
ఎట్టకేలకు 'హరిహరవీరమల్లు' ప్రేక్షకుల ముందుకు రావడానికి సమాయత్తం అవుతుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడినా ఈసారి మాత్రం రిలీజ్ పక్కా.;
ఎట్టకేలకు 'హరిహరవీరమల్లు' ప్రేక్షకుల ముందుకు రావడానికి సమాయత్తం అవుతుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడినా ఈసారి మాత్రం రిలీజ్ పక్కా. జూన్ 12న థియేటర్లోకి వచ్చేస్తుంది. దీనిలో భాగంగా యూనిట్ ప్రచారం పనులు కూడా ప్రారంభించింది. పాన్ ఇండియా సినిమా కావడంతో దేశ వ్యా ప్తంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది. మరి అందుకు పవన్ కళ్యాణ్ ఎంతవరకూ సహకరిస్తారు? అన్నది చూడాలి. తెలుగులో జరిగే ఈవెంట్ కు తప్పక హాజరవుతారు.
కానీ నార్త్ ప్రచారం కోసం ఆయన ఎంత వరకూ సపోర్ట్ ఇస్తారు? అన్నది చూడాలి. అలాగే బెంగుళూరు, చెన్నై లాంటి సిటీల్లోనూ ఈవెంట్లు నిర్వహిస్తారు. పవన్ రాజకీయాల్లోకి వెళ్లడంతో దేశమంతా ఫేమస్ అయ్యారు. అందులోనూ సనాతన ధర్మం పేరిట ఆ మధ్య నార్త్ లో బాగా ఫేమస్ అయ్యారు. ప్రధాని మోదీ కూడా బాగా అభిమానించే వ్యక్తి కాబట్టి దేశ వ్యాప్తంగా ఈ రకమైన గుర్తింపు దక్కింది.
నిస్వార్ద నాయకుడని మోదీ విశ్వసించడంతో ఇది సాద్యమైంది. అందుకు తగ్గట్టే పవన్ చర్యలు కూడా ఉంటున్నాయి. అయితే ఈసినిమాకు సంబంధించి ప్రచారంలో భాగంగా రెండు పెద్ద ఈవెంట్ల నిర్వహి స్తామని ఏ.ఎం రత్నం ప్రకటించారు. ఆ రెండు పెద్ద ఈవెంట్లు ఎక్కడ? అన్నది మాత్రం చెప్పలేదు. దీంతో ఒకటి హైదరాబాద్ లో మరోకటి అమరావతి లేదా? వైజాగ్ లో ఉంటుందా? లేకుంటే ఒక ఈవెంట్ ని ఉత్తరాది రాష్ట్రాల్లో ప్లాన్ చేస్తున్నారా? అన్నది క్లారిటీ లేదు.
తెలుగు పరంగా రెండు ఈవెంట్లు నిర్వహిం చాల్సిన పనిలేదు. ఒక ఈవెంట్ తో సరిపోతుంది. మరో ఈవెంట్ నార్త్ లేదా? సౌత్ ఇతర రాష్ట్రల్లో ఎక్కడైనా ప్లాన్ చేస్తున్నారా? అన్నది చూడాలి. తెలుగు విషయానికి వస్తే హైదరాబాద్ లేదా అమరావతి వేదిక కావొచ్చు. ఉత్తరాదిన మాత్రం అంచనా వేయడం కష్టం. ఈ సినిమా కథ కూడా హిందు ధర్మానికి పెద్ద పీట వేసే కథ. మొఘల సామ్రాజ్యంపై వీరమల్లు పోరాటమే ఈ కథ. ఈ నేపత్యంలో నార్త్ లో ఈవెంట్ నిర్వహిస్తే బీజేపీ పెద్దలు ఎవరైనా హాజరవుతారా? అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది.