• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హనుమాన్ ముందున్న సవాళ్లు...

హనుమాన్ ముందున్న సవాళ్లు ఇవే..!

| మా సినిమాలో పండుగకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి అందుకే సంక్రాంతికి వస్తున్నాం అంటున్నారు ప్రశాంత్ వర్మ

By - Tupaki Desk
Update: 2023-11-30 14:33 GMT

సంక్రాంతి రిలీజ్ కు మేము కూడా రెడీ అంటున్నారు హనుమాన్ టీం. ప్రతిభ గల దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో తేజ సజ్జా లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో సినిమాగా ప్రమోట్ చేస్తున్న ఈ సినిమా అసలైతే ఈ ఏడాది రిలీజ్ చేయాలని రెండు మూడు డేట్లు అనుకున్నా ఎందుకో కుదరలేదు. ఇక ఏదైతే అది అయ్యింది కానీ అనుకుని సంక్రాంతి రేసులో రావాలని ఫిక్స్ అయ్యారు. సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ ఆ టైం లో స్టార్ హీరోల సినిమాలు పోటాపోటీగా రంగంలోకి దిగుతాయి ఈ ఫైట్ లో హనుమాన్ కూడా ఉండబోతుంది.

మా సినిమాలో పండుగకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి అందుకే సంక్రాంతికి వస్తున్నాం అంటున్నారు ప్రశాంత్ వర్మ. సంక్రాంతికి స్టార్ సినిమాలు వస్తున్నాయి అంటే వాటికే ఎక్కువ స్క్రీన్స్ కేటాయించే అవకాశం ఉంటుంది. ఒకే డిస్ట్రిబ్యూటర్ అయినా కూడా హనుమాన్ కన్నా స్టార్ సినిమాకు ఎక్కువ థియేటర్ లు ఇస్తారు. హనుమాన్ సినిమా మహేష్ గుంటూరు కారం సినిమా రిలీజ్ రోజే వస్తుంది. మహేష్ సినిమా ముందు హనుమాన్ నిలబడగలుగుతుందా అన్నది చెప్పడం కష్టం.

కంటెంట్ ఉన్న సినిమాలకు తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఓటేస్తారు. ఇప్పటివరకు ప్రశాంత్ వర్మ సినిమాలు డిసప్పాయింట్ చేయలేదు అదే హనుమాన్ కి రిపీట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు. కానీ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయడం అన్నది కరెక్ట్ చాయిస్ కాదని కొందరి వాదన. జనవరి 1 నుంచి 11 వరకు లేదా 14 తర్వాత కానీ రిలీజ్ చేస్తే హనుమాన్ కి కాస్త ప్లస్ అవ్వొచ్చని అంటున్నారు.

కానీ హనుమాన్ టీం మాత్రం జనవరి 12న అది కూడా మహేష్ సినిమా రిలీజ్ రోజే వాళ్లు రిలీజ్ లాక్ చేశారు. ఇదేకాదు సంక్రాంతికి రవితేజ ఈగల్, నాగార్జున నా సామి రంగ, వెంకటేష్ సైంధవ్ సినిమాలు కూడా వస్తున్నాయి. ఈ సినిమాల మధ్య హనుమాన్ నెగ్గుకు రాగలదా అన్నది చూడాలి. ప్రశాంత్ వర్మ క్రియేటివ్ యూనివర్స్ నుంచి వస్తున్న హనుమాన్ సినిమాపై చిత్ర యూనిట్ అంతా కూడా చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు కూడా సినిమాపై బజ్ పెంచడంలో సక్సెస్ అయ్యాయి. సినిమా ఎంత బాగున్నా సరే సరైన టైం లో రిలీజ్ చేయకపోతే రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. మరి హనుమాన్ విషయంలో అలా జరుతుందా లేదా స్టార్ సినిమాలకు ధీటుగా నిలుస్తుందా అన్నది చూడాలి. స్టార్ సినిమాలకు పోటీగా అది కూడా సంక్రాంతి టైం లో రిలీజ్ అనేసరికి హనుమాన్ సినిమాకు థియేటర్ల సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. మరి వీటన్నిటినీ హనుమాన్ ఎలా దాటగలదో చూడాలి.

Tags:    
  • HanuMan 
  • Tejasajja 
  • Prashathvarma 
  • Filmindustry 
  • HanuManmovie 
  • Maheshbabu 
  • Gunturkaaram 

Similar News

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS