విడాకుల రూమర్స్.. జీవితం ఎన్నో పాఠాలు నేర్పింది -హన్సిక

అయితే విడాకుల రూమర్స్ వినిపిస్తున్న వేళ హన్సిక పెట్టిన ఏ చిన్న పోస్ట్ అయినా సరే అది క్షణాల్లో వైరల్ అవుతుంది.;

Update: 2025-08-11 11:25 GMT

హన్సిక మోత్వాని.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న పేరు.. ఈ హీరోయిన్ భర్తతో విడాకులు తీసుకోబోతుంది అనే రూమర్స్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే అలాంటి హన్సిక తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక సంచలన పోస్ట్ పెట్టింది.అయితే విడాకుల వార్తలు వినిపిస్తున్న వేళ హన్సిక ఇలాంటి ఒక పోస్ట్ పెట్టడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మరి ఇంతకీ హన్సిక పెట్టిన ఆ పోస్ట్ లో ఏముంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

తాజాగా హన్సిక మోత్వాని బర్త్డే కావడంతో ఆమె తన అభిమానులు, సెలబ్రిటీలు,కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ వీళ్ళందరి నుండి వచ్చిన విషెష్ కి రిప్లై ఇస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ఇక ఆ పోస్టులో ఏముందంటే.. "ఈ సంవత్సరం నా జీవితం నేను అడగకుండానే నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నాలో ఏదో తెలియని బలం ఉంది అనే విషయాన్ని కూడా బయట పెట్టింది. నా బర్త్ డే రోజున మీ అందరి శుభాకాంక్షలుతో నా హృదయం ఉప్పొంగిపోతోంది.. నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఒక్కోసారి చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తాయి..మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు" అంటూ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.

అయితే విడాకుల రూమర్స్ వినిపిస్తున్న వేళ హన్సిక పెట్టిన ఏ చిన్న పోస్ట్ అయినా సరే అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అలా తాజాగా హన్సిక తన బర్త్డేకి విషెస్ చెప్పిన వారి గురించి,అలాగే 2025 సంవత్సరం గురించి ఉద్దేశిస్తూ పెట్టిన ఈ పోస్ట్ కూడా వైరల్ గా మారింది. ముఖ్యంగా హన్సిక విడాకుల వార్తలు వినిపిస్తున్న వేళ ఈ సంవత్సరం నాకెన్నో పాఠాలు నేర్పింది అని పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తోంది. మరి హన్సిక ఇప్పటికైనా తన విడాకుల వార్తలపై స్పందించి నిజమో కాదో చెబుతుందా? అనేది వేచి చూడాలి.

ఇక 2022లో సోహైల్ కతూరియా (Sohail Khaturiya) ని పెళ్లి చేసుకున్న హన్సిక పెళ్లయిన రెండేళ్లకే విడాకులు తీసుకోబోతున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అత్తింట్లో ఉండే ఉమ్మడి కుటుంబంతో సెట్ అవ్వలేకే హన్సిక తన పుట్టింటికి వచ్చేసినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే సోహైల్ ఈ విడాకుల వార్తలను ఖండించినప్పటికీ హన్సిక మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. ఇక రీసెంట్ గా హన్సిక తన పెళ్లి ఫోటోలు డిలీట్ చేసి విడాకుల వార్తలకు మరింత ఆజ్యం పోసింది.. ఇక హన్సిక మోత్వాన్ని సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఆర్.కన్నన్ (R.Kannan) దర్శకత్వంలో వస్తున్న శ్రీ గాంధారి (Sri Gandhari) సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ హార్రర్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతోంది.

Tags:    

Similar News