• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గుంటూరు కారం మెలోడీ.....

గుంటూరు కారం మెలోడీ.. రెండింటిలో ఏదో ఒకటి

| దీంతో ఇప్పుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మహేష్ బాబు కోసం అతను ఎలాంటి ట్యూన్ రెడీ చేశాడు అనేది ఆసక్తిగా మారింది. త్రివిక్రమైతే మంచి ట్యూన్స్ ఇచ్చేవరకు అసలు వదిలి పెట్టడు.

By - Tupaki Desk
Update: 2023-09-30 04:00 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ఫస్ట్ సాంగ్ ఎప్పుడు వస్తుందో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సాంగ్ అప్డేట్ విషయంలో ఎంత ఆసక్తిగా ఉన్నారో అంతే టెన్షన్ తో కూడా ఉన్నారు అని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇచ్చినా ట్యూన్స్ అంతగా క్లిక్ కావడం లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా అతను కిక్ ఇవ్వడం లేదు అని రొటీన్ గానే కొడుతున్నాడు అనే విధంగా కామెంట్స్ కూడా వస్తున్నాయి.

దీంతో ఇప్పుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మహేష్ బాబు కోసం అతను ఎలాంటి ట్యూన్ రెడీ చేశాడు అనేది ఆసక్తిగా మారింది. త్రివిక్రమైతే మంచి ట్యూన్స్ ఇచ్చేవరకు అసలు వదిలి పెట్టడు. అల.. వైకుంఠపురములో.., అరవింద సమేత సినిమాలకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ బాగానే వర్కౌట్ అయింది. కాబట్టి ఈ సినిమాకు కూడా థమన్ చేత మాటల మాంత్రికుడు మంచి మాటలు సిద్ధం చేయిస్తాడు అని ఓ వర్గం ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

ఇక ఈ మొదటి సాంగ్ ఎలా ఉంటుంది ఎప్పుడు వస్తుంది అనే విషయంలో ఇప్పటికే కొన్ని లీక్స్ వచ్చాయి. నిర్మాత నాగవంశి అయితే ఈ సినిమా ఫస్ట్ సాంగ్ దసరా కంటే ముందే ఉంటుంది అని ఇటీవల క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం మొదటి పాట మెలోడీగా ఉండబోతుందట.

ఇక ఆ పాటను అనురాగ్ కులకర్ణి పాడినట్లుగా తెలుస్తోంది. అయితే రెండు వెర్షన్లలో పాటలను రచించినట్లు సమాచారం. ఒకరు రామ జోగయ్య శాస్త్రి, మరొకరు కాసర్ల శ్యామ్ ఇద్దరితో కూడా రెండు వర్షన్స్ రాయించగా అనురాగ్ కులకర్ణి ఆ రెండిటిని పాడినట్లుగా తెలుస్తోంది. ఇక ఏది బాగుంటే దాన్ని ఫైనల్ చేసి త్వరలోనే అప్డేట్ ఇవ్వాలని అనుకుంటున్నారు.

దసరా కంటే ముందే పాట ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాను 2024 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. వాయిదా పడే అవకాశం ఉంది అని ఆ మధ్య టాక్ వినిపించినప్పటికీ అందులో ఎలాంటి నిజం లేదు అని నిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారు.

Tags:    
  • Tollywood 
  • Trivikram 
  • Maheshbabu 
  • Gunturkaram 
  • Gunturkarammovie 
  • Ssthaman 
  • Music 
  • Nagavamshi 

Similar News

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS