• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గుంటూరు కారం.. విడుదలకు...

గుంటూరు కారం.. విడుదలకు ముందే ప్రాఫిట్స్

| కానీ కేవలం తెలుగులో మాత్రమే నిర్మిస్తున్న గుంటూరు కారం బడ్జెట్ ఏకంగా 220 కోట్లకు పైగానే ఖర్చు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.

By - Tupaki Desk
Update: 2023-08-29 08:03 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న గుంటూరు కారం సినిమా అనేక రకాల మలుపులతో మొత్తానికి ఒక ట్రాక్లోకి అయితే వచ్చింది. సినిమా షూటింగ్ ఎన్నిసార్లు ఆగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలు సినిమా అనుకున్న సమయానికి పూర్తవుతుందా సంక్రాంతికి చెప్పినట్లుగానే విడుదల చేస్తారా లేదా అని అనుమానాలు కూడా చాలానే వచ్చాయి.

కానీ నిర్మాణ సంస్థ హారిక హాసిని మాత్రం ఈ విషయంలో కాన్ఫిడెంట్ గానే కనిపించింది. త్రివిక్రమ్ మహేష్ బాబును ఒప్పించడంలో మధ్యలో కాస్త తడబడినప్పటికీ కూడా మొత్తానికి అయితే ఒక రూట్లోకి తీసుకువచ్చి శరవేగంగా షూటింగ్ పనులను పూర్తి చేసే పని చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తప్పకుండా మార్కెట్లో మంచి బిజినెస్ అయితే చేస్తుంది అని అనిపిస్తోంది. ఇక బడ్జెట్ ఎంత కాబోతోంది అనే విషయం కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

సాధారణంగా పాన్ ఇండియా సినిమా అంటే మినిమం బడ్జెట్ అయితే 150 కోట్లు దాటుతుంది. కానీ కేవలం తెలుగులో మాత్రమే నిర్మిస్తున్న గుంటూరు కారం బడ్జెట్ ఏకంగా 220 కోట్లకు పైగానే ఖర్చు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒక సింగిల్ లాంగ్వేజ్ సినిమా కోసం అత్యధిక స్థాయిలో ఖర్చుపెడుతున్న నిర్మాతలుగా హారిక హాసిని హాట్ టాపిక్ గా నిలుస్తుంది.

ఇక ఈ కాంబినేషన్కు ఉన్నటువంటి క్రేజ్ వలన తప్పకుండా టేబుల్ ప్రాఫిట్ దక్కుతుంది అని నిర్మాతలు కూడా నమ్ముతున్నారు. సినిమా నటీనటులకు అలాగే టెక్నీషియన్స్ రెమ్యునరేషన్ కోసమే 120 కోట్లకు పైగా అయినట్లుగా తెలుస్తోంది. అలాగే పబ్లిసిటీ ప్రింట్ వంటి వాటికోసం మరో 100 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ఈ విధంగా చూసుకుంటే సినిమా బడ్జెట్ 220 కోట్ల వరకు అయ్యేటట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా రిటర్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సినిమా విడుదలకు ముందే థియేట్రికల్ గా దాదాపు 125 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇక నాన్ థియేటర్ హక్కులు మొత్తాన్ని కూడా నెట్ ఫ్లిక్స్ దాదాపు 80 కోట్లు ఖర్చు చేసి డీల్ సెట్ చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇక ఆడియో రైట్స్ నుంచి మరో 20 కోట్లు రాబోతున్నాయి.

ఈ విధంగా సంక్రాంతికి రాబోయే గుంటూరు కారం ఎలా చూసుకున్నా నిర్మాతను టేబుల్ ప్రాఫిట్స్ తీసుకువచ్చే అవకాశం అయితే ఉంది. మరి సినిమా విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రాఫిట్ అందిస్తుందో చూడాలి.

Tags:    
  • Gunturkaaram 
  • Maheshbabu 
  • Tollywood 
  • Sreeleela 
  • Meenkashichaudhry 
  • Trivikramsrinivas 

Similar News

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS