• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గుణశేఖర్.. ఈసారి...

గుణశేఖర్.. ఈసారి ‘యుఫోరియా’

| గుణశేఖర్ ప్రస్తుతం యువతను ఆకట్టుకునే సామాజిక అంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

By - Tupaki Desk
Update: 2024-05-28 07:21 GMT

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా తనదైన ముద్ర వేశారు గుణశేఖర్. ‘ఒక్కడు’, ‘చూడాలని వుంది’, ‘అర్జున’ వంటి హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక ఇటీవల కాలంలో ఆయన కొన్ని సినిమాలతో అపజజయాలు ఎదుర్కొన్నప్పటికీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని హార్డ్ వర్క్ చేస్తున్నారు. లేటెస్ట్ ట్రెండ్ లో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది

గుణశేఖర్ ప్రస్తుతం యువతను ఆకట్టుకునే సామాజిక అంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'యుఫోరియా’ పేరుతో రాబోతున్న ఈ చిత్రం, యువతను ఆకట్టుకునే సామాజిక అంశాలను చర్చించనుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రతి అంశం పక్కాగా ప్లాన్ చేసి, ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ కష్టపడుతున్నారు.

గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నీలిమా గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. నటీనటులు మరియు సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు. గుణశేఖర్ కెరీర్ విషయానికి వస్తే, ఆయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని చిత్రాలు కమర్షియల్ భారీ విజయాలు సాధించాయి.

కానీ ఇటీవల, ఆయనకు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా విజయాలు దక్కలేదు. చివరగా చేసిన శాకుంతలం సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినప్పటికీ ఆయన మళ్ళీ సరికొత్త కథనంతో సిద్ధమవుతున్నారు ఈ నేపధ్యంలో, ‘‘యుఫోరియా’’ చిత్రం గుణశేఖర్‌కు తప్పనిసరిగా హిట్ ఇవ్వాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

‘రుద్రమదేవి’ వంటి చారిత్రాత్మక చిత్రంతో మంచి ప్రశంసలు పొందిన గుణశేఖర్, ఇప్పుడు సరికొత్త కథాంశంతో యువతను చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సమకాలీన సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ, యువతను ఆకట్టుకునేలా ఈ కథను తెరకెక్కిస్తున్నారు. యుఫోరియా సినిమా కథ, ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉంటుందట.

సాంకేతికంగా మరియు కథాపరంగా కొత్తదనం, వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని గుణశేఖర్ భావిస్తున్నారు. గుణశేఖర్ కెరీర్‌లో ఇది ఒక కీలకమైన మలుపుగా ఉండనుంది. ఆయనకు ఈ సినిమాతో మంచి విజయం అందడం ముఖ్యం. నిర్మాతగా కూడా ఆయన సొంతంగా రిస్క్ తీసుకుంటున్నారు. మరి ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి

Tags:    
  • Gunasekhar 
  • Movie 
  • Tollywood 
  • Euphoria 
  • Neelimaguna 
  • Gunahandmadefilms 
  • Filmindustry 

Similar News

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS