9 ఏళ్ల ప్రేమకు స్వస్తి.. ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న బ్యూటీ.. వరుడు ఎవరంటే?
ప్రస్తుత కాలంలో చాలా మంది హీరోలే కాకుండా హీరోయిన్లు కూడా తమ బ్యాచిలర్ లైఫ్ కి స్వస్తి పలుకుతున్నారు.;
ప్రస్తుత కాలంలో చాలా మంది హీరోలే కాకుండా హీరోయిన్లు కూడా తమ బ్యాచిలర్ లైఫ్ కి స్వస్తి పలుకుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు మరొక హీరోయిన్ కూడా తాను మెచ్చిన అబ్బాయిని తొమ్మిదేళ్లు ప్రేమించి, ఇప్పుడు సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు అందుకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకోగా.. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఆమె ఎవరో కాదు మలయాళ నటి గ్రేస్ ఆంటోనీ. వాస్తవానికి ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదనే చెప్పాలి. ఎందుకంటే ఈమె కేవలం బాలీవుడ్ కే పరిమితమై అక్కడే సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇదే క్రమంలో మాలీవుడ్ కి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ అభి టామ్ ను తొమ్మిదేళ్లుగా ప్రేమించిన ఈమె ఇప్పుడు ఆ ప్రేమ బంధానికి స్వస్తి పలుకుతూ.. నిశ్చితార్థంతో వివాహం వైపు అడుగులు వేసింది. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అంటోనీ గ్రేస్ విషయానికి వస్తే.. మలయాళ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న ఈమె.. 2016లో వచ్చిన 'హ్యాపీ వెడ్డింగ్' అనే సినిమాతో మలయాళం సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.. తర్వాత కనకం కామిని కలహం, వివేకానంద వైరల్, నాగేంద్రన్ హనీమూన్స్ , కుంబలంగి నైట్స్ తదితర చిత్రాలలో నటించి హీరోయిన్గా భారీ పాపులారిటీ అందుకుంది. ఈమె హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసింది. అంతేకాదు కొన్ని వెబ్ సిరీస్లలో కూడా నటించిన ఈమె.. ఒకటి రెండు చిత్రాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసింది.
ఇక వీరి పరిచయం, ప్రేమ ఎలా మొదలైంది? అనే విషయానికి వస్తే ..వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక క్రేజీ సొంతం చేసుకున్న గ్రేస్ ఆంటోని 9 ఏళ్ల క్రితం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అభి టామ్ తో పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని ఇప్పుడు నిశ్చితార్థం కూడా చేసుకున్నామని ఈమె తెలిపింది. ఇకపోతే ఇన్నేళ్లపాటు తమ బంధాన్ని రహస్యంగా ఉంచడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..
అభి టామ్ విషయానికి వస్తే.. ఇప్పుడిప్పుడే మ్యూజిక్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. పలు సినిమాలకు, షార్ట్ ఫిలిమ్స్ కి, మ్యూజిక్ ఆల్బమ్స్ కి కూడా ఈయన మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.. ఇలా ఒకవైపు కెరియర్ పై ఫోకస్ పెట్టిన ఈ జంట.. మరొకవైపు తమ వైవాహిక బంధం వైపు అడుగులు వేస్తూ కొత్త అధ్యాయానికి తలుపు తెరవబోతున్నారని తెలుస్తోంది. మొత్తానికి అయితే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఎప్పుడు వివాహం చేసుకోబోతోంది అనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు.