విమ‌ర్శ‌ల‌కు చెంప పెట్టులా స్టార్ న‌టుడు కంబ్యాక్!

ఒకప్పుడు గోవిందా అంటేనే ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. ఆయన టైమింగ్, డ్యాన్స్ మూమెంట్స్ అప్పట్లో ఓ సంచలనం.

Update: 2026-07-14 19:30 GMT

బాలీవుడ్ కామెడీ కింగ్, డ్యాన్స్ మాస్టర్ గోవిందా మళ్ళీ సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. దశాబ్దాలుగా వెండితెరపై తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించిన గోవిందా కొంతకాలంగా తెరపై కనిపించకపోయేసరికి పరిశ్రమ ఆయన అధ్యాయం ముగిసిందని భావించింది. అయితే తనపై వచ్చిన విమర్శలను పటాపంచలు చేస్తూ గోవిందా మరోసారి కెమెరా ముందుకు వ‌స్తున్న‌ట్లు ప్రకటించారు. కెరీర్ లో ఒడిదుడుకులకు కొత్తేమీ కాకపోయినా? ఈసారి పరిస్థితి భిన్నమని అభిప్రాయపడ్డారు. `నేను వెండితెరపై కనిపించనని.. కెరీర్ ముగిసిపోయిందని ఎందరో ఎన్నో రకాలుగా మాట్లాడుకున్నారు. చాలా సార్లు పరిశ్రమ నన్ను మర్చిపోయింద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. తనను పక్కన పెట్టిన వారి మాటలను పట్టించుకోకుండా అదే పట్టుదలతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడమే తన సమాధానమన్నారు.

ఒకప్పుడు గోవిందా అంటేనే ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. ఆయన టైమింగ్, డ్యాన్స్ మూమెంట్స్ అప్పట్లో ఓ సంచలనం. అయితే కాలంతో పాటు మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా తనను తాను మలచుకోవడంలో గోవిందా ఎదుర్కొన్న సవాళ్లు అన్ని ఇన్ని కావు. వెండితెర అవకాశాలు తగ్గడం, కథల ఎంపికలో వచ్చిన మార్పులు ఆయనపై తీవ్ర ప్రభావం చూపాయి. తాజాగా వాటి నుంచి పాఠాలు నేర్చుకుని తన అనుభవాన్ని కొత్త తరానికి అందించేలా పాత్రలను ఎంచుకుంటున్నారు. ఈ పునరాగమనం వెనుక ఉన్న అతిపెద్ద ఉద్దేశ్యం అభిమానుల కోరికను నెరవేర్చడమేనని గోవిందా చెబుతున్నారు.

ఇప్పటికీ తన సినిమాలను ఇష్టపడే వారు మళ్ళీ అదే జోష్‌తో ఆయన్ని చూడాలనుకునే వారు కోకొల్లలు. అలాంటి వారి కోసం ఏదో ఒక సినిమా చేయడం కంటే తన ఇమేజ్‌కి .. వయసుకు తగినట్లుగా ఉండే బలమైన పాత్రలతో రావాలని నిర్ణయించుకున్నారు. ఇది రీ-ఎంట్రీ మాత్రమే కాదు. తన సామర్థ్యాన్ని నిరూపించుకునే మరో అవకాశం అని గోవిందా బ‌లంగా నమ్ముతున్నారు. ముందున్న సవాలును స్వీకరించడం గోవిందాలో ఉన్న అసలైన నటుడిని మరోసారి మేల్కొల్పింది. `నేను ఇంకా ఆట ముగించలేదు. కేవలం విరామం మాత్రమే తీసుకున్నాను` అన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి.

తనదైన సహజ నటనతో ఇప్పటికీ ప్రేక్షకులను నవ్వించగల సామర్థ్యం ఉందని నిరూపించేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇది ఆయన అభిమానులకు పండుగలాంటి వార్త. ఒక నటుడు ఎంతటి స్థాయికి ఎదిగినా? పరిశ్రమలో నిలదొక్కుకోవడం అనేది నిరంతర పోరాటం. గోవిందా వంటి అగ్రనటుడు మళ్ళీ ఉనికిని చాటుకోవడానికి చూపిస్తున్న దృఢ నిశ్చయం ఎంతో స్ఫూర్తిదాయకం. గతాన్ని వెనక్కి నెట్టి వర్తమానంలో కొత్త పాత్రలతో మళ్ళీ మెరవడానికి సిద్ధమవుతున్న గోవిందాకి సెకండ్ ఇన్నింగ్స్ ఖచ్చితంగా గుర్తుండిపోయేలా ఉండాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News