ఇండియా ఎకనామిక్ క్రైసిస్ కథతో 'గవర్నర్'.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే!
మనోజ్ బాజ్‌పాయ్ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ హిందీ మూవీ 'గవర్నర్' ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది.
మనోజ్ బాజ్‌పాయ్ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ హిందీ మూవీ 'గవర్నర్' ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది. 1991లో మన దేశం ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ బ్యాక్‌డ్రాప్ లో ఒక ఫైనాన్షియల్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ రోజు థియేటర్లలో సినిమా చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా ఎలాంటి అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నారో ఒకసారి చూద్దాం.
సినిమా చూసిన వాళ్లలో మెజారిటీ జనాలు చెబుతున్న మెయిన్ పాయింట్ ఏంటంటే.. ఇండియాలో ఎల్‌పీజీ (లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) సంస్కరణలు రావడానికి ముందు అసలు ఏం జరిగింది అనే పాయింట్ ను ఇందులో చాలా డీటెయిల్డ్ గా చూపించారట. దేశం దివాలా తీసే పరిస్థితి వచ్చినప్పుడు ఒక ఆర్బీఐ గవర్నర్ గా ఆర్. రామణ్ (మనోజ్ బాజ్‌పాయ్) ఎలాంటి నిర్ణయాలు తీసుకుని దేశాన్ని గట్టెక్కించారు అనే పాయింట్ ఆకట్టుకునేలా ఉందని నెటిజన్లు రాసుకొస్తున్నారు.
ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయకుండా అప్పట్లో జరిగిన నిజ జీవిత సంఘటనలను మాత్రమే గ్రౌండెడ్ గా చూపించడం సినిమాకు ప్లస్ అయిందని అభిప్రాయపడుతున్నారు.
యాక్టింగ్ పరంగా చూస్తే మనోజ్ బాజ్‌పాయ్ వన్ మ్యాన్ షో చేశాడని ఆడియన్స్ ప్రశంసిస్తున్నారు. పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నప్పటికీ చాలా కూల్ గా, డిగ్నిఫైడ్ గా ఉండే ఆర్బీఐ గవర్నర్ క్యారెక్టర్ లో ఆయన నటన నెక్స్ట్ లెవెల్ లో ఉందనే కామెంట్స్ వస్తున్నాయి.
జర్నలిస్ట్ గా అదా శర్మ, హీరో భార్యగా మధూతో పాటు మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ అంతా తమ పాత్రలకు న్యాయం చేశారని టాక్. టెక్నికల్ గా చూస్తే 1990ల నాటి పరిస్థితులను స్క్రీన్ పై పర్ఫెక్ట్ గా రీక్రియేట్ చేశారని ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే అందరికీ ఈ సినిమా ఒకేలా కనెక్ట్ కాకపోవచ్చని కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో కథ కాస్త స్లోగా సాగుతుందని, ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే మధ్యలో వచ్చే ఒక ఎంప్లాయ్ సబ్ ప్లాట్ అంతగా వర్కౌట్ కాలేదని, అది మెయిన్ కథకు పెద్దగా హెల్ప్ అవ్వలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇక పబ్లిక్ లో బజ్ ప్రకారం చూస్తే.. ఈ సినిమా అందరినీ మెప్పించే రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ అయితే అస్సలు కాదని అర్ధమవుతుంది. పాటలు, ఫైట్లు, కామెడీ లాంటి ఎలిమెంట్స్ ఆశించి థియేటర్లకు వెళితే నిరాశ తప్పదని, కేవలం కంటెంట్ బేస్డ్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు, ఫైనాన్షియల్ థ్రిల్లర్స్ చూడాలనుకునే వాళ్లకు మాత్రమే ఇది కనెక్ట్ అవుతుందనే టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమా ఇలాంటి టాక్ ను తట్టుకొని ఎలా నిలబడుతుందో చూడాలి.