బోయపాటిని మలీనేని కొట్టేలా ప్లాన్ చేసాడా!
బోయపాటి-బాలయ్య కాంబినేషన్ అంటే ఓ చరిత్ర. అలాంటి కాంబినేషన్ మళ్లీ సాధ్యమా? అంటే నో ఛాన్స్ అనే అంటారంతా. ఎందుకంటే వచ్చిన సినిమాలు అలాంటివి. 'సింహ', 'లెజెండ్', 'అఖండ' ఇలా చేసిన మూడు సినిమాలు బ్లాక్ బస్టరే.;
బోయపాటి-బాలయ్య కాంబినేషన్ అంటే ఓ చరిత్ర. అలాంటి కాంబినేషన్ మళ్లీ సాధ్యమా? అంటే నో ఛాన్స్ అనే అంటారంతా. ఎందుకంటే వచ్చిన సినిమాలు అలాంటివి. 'సింహ', 'లెజెండ్', 'అఖండ' ఇలా చేసిన మూడు సినిమాలు బ్లాక్ బస్టరే. మూసలో వెళ్తోన్న బాలయ్యకు సరికొత్త ఇమేజ్ ని తెచ్చి పెట్టింది బోయపాటి. అప్పటి నుంచి బాలయ్య-బోయపాటి కలయిక అంటే ఓ సంచలనం. వాళ్లు చేతులు కలిపా రంటే? ఏదో అద్భుతం చేస్తారనే నమ్మకం అభిమానులకు. మరి ఈ విషయంలో బోయపాటికి ధీటుగా గోపీచంద్ మలినే ని రంగంలోకి దిగుతున్నాడా? అంటే అవుననే అనాలి.
కొన్ని గంటల క్రితమే నటసింహా బాలకృష్ణతో మరో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇద్దరి కాంబినేషన్ లో రిలీజ్ అవుతున్న రెండవ చిత్రమిది. తొలి ప్రయత్నంగా 'వీరసింహారెడ్డి' అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈసినిమా మంచి విజయం సాధించింది. బాక్సా ఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. బాలయ్య ని ఎలా చూపించాలో? అలా చూపించి సక్సెస్ అయ్యాడు. దీంతో రెండవ సినిమా ఛాన్స్ విషజ్ఞంలో బాలయ్య మరో ఆలోచన లేకుండా ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు మలినేని అంతే పకడ్బందీగా బరిలోకి దిగుతున్నాడు. బాలయ్య మనసులో బోయపాటి స్థానాన్ని రీప్లేస్ చేసేలా సరైన ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమా అంటూ పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చాడు. చరిత్రకు భారీ యాక్షను ముడిపెట్టి చేస్తోన్న చిత్రంగా పేర్కొన్నాడు. ఇదోక ఎపిక్ చిత్రంగా ప్రకటించాడు. మునుపెన్నడు చూడని సరికొత్త బాలయ్యను చూపిస్తానంటూ ధీమా వ్యక్తం చేసాడు.
యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరుగా మలినేనికి మంచి పేరుంది. దీంతో బాలయ్య పాత్ర ఎలా ఉండబో తుంది? అన్న ఆసక్తి మొదలైంది. బాలయ్య రోల్ గత చిత్రాలకు భిన్నంగా ఉండాలి. ప్రత్యేకించి బోయపా టి శైలికి పూర్తి భిన్నంగా ఉండాలి. హీరో ఎలివేషన్ పరంగా బోయపాటిని మించి చూపించాలి. అందులో కొత్తదనం ఉండాలి. బాలయ్య ఇమేజ్ తోనే బండి నడిపిద్దామనే ఆలోచన ఉండకూడదు. కథలో కొత్తద నం ఉండాలి. రిలీజ్ తర్వాత బోయపాటి గత సినిమా వసూళ్లు అన్నింటి బ్రేక్ చేయాలి. బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర రాయాలి. ఇదంతా జరిగినప్పుడే బాలయ్య నమ్మకం నిలబడినట్లు అన్నది మలినేని గుర్తించాలి.