శూల రాజ్యంలో గోపీచంద్ రౌద్రం.. భరతవర్ష గ్లింప్స్‌తో షాక్!
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న గోపీచంద్33 ఇప్పుడు అధికారికంగా భరతవర్ష పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.;
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న గోపీచంద్33 ఇప్పుడు అధికారికంగా భరతవర్ష పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ పాన్-ఇండియా సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకోగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు సమాంతరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించింది.
యోధుడిగా గోపీచంద్
642 AD కాలాన్ని బ్యాక్‌డ్రాప్‌గా తీసుకుని, శూల రాజ్యం అనే చారిత్రక నేపథ్యంతో ఈ కథ సాగుతున్నట్లు గ్లింప్స్ ద్వారా స్పష్టమైంది. యుద్ధభూమిలో సాహసవంతుడైన యోధుడిగా గోపీచంద్ కనిపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. అతని లుక్ పూర్తిగా కొత్తగా ఉండటమే కాకుండా, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మాస్ ప్రెజెన్స్, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్ ఈ పాత్రకు మరింత బలాన్ని చేకూర్చాయి.
విజువల్ గ్రాండియర్ గా గ్లింప్స్
గ్లింప్స్ లో గోపిచంద్ పాత్రను ఎలివేట్ చేయడంపైనే మేకర్స్ పూర్తి దృష్టి సారించినట్టు అర్థమవుతుంది. యాక్షన్ సీక్వెన్స్‌లు, భారీ యుద్ధ దృశ్యాలు, విజువల్ గ్రాండియర్.. అన్నీ కలిపి ఈ గ్లింప్స్ కు లార్జర్ దేన్ లైఫ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ను ఇస్తున్నారు. టెక్నికల్ గా కూడా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతున్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ అందించిన విజువల్స్ చాలా రిచ్‌గా కనిపిస్తున్నాయి. ప్రొడక్షన్ డిజైనర్ చిన్నా రూపొందించిన సెట్స్ 7వ శతాబ్దపు కాలాన్ని నిజంగా తిరిగి తెచ్చినట్టుగా ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌కు మరింత తీవ్రతను జోడించింది.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి తన శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఎలాంటి రాజీ లేకుండా తెరకెక్కుతున్న ఈ సినిమా, గోపిచంద్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భరతవర్ష టైటిల్ గ్లింప్స్ ఒక విజువల్ స్పెక్టకల్‌గా నిలిచి, ప్రేక్షకుల్లో ఆసక్తిని తారాస్థాయికి తీసుకెళ్లింది. చారిత్రక నేపథ్యం, భారీ యాక్షన్, సాంకేతిక నైపుణ్యం.. ఇవన్నీ కలిసి ఈ సినిమాను ఒక గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ గా మార్చనున్నాయని చెప్పవచ్చు.