• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ స్టార్‌ హీరో నిన్న...

ఆ స్టార్‌ హీరో నిన్న ఆకాశానికి, రేపు పాతాళానికి..!

| సౌత్ సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడు అనగానే వినిపించే పేర్లలో కచ్చితంగా మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు ముందు ఉంటుంది

By - Tupaki Desk
Update: 2024-04-01 11:30 GMT

సౌత్ సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడు అనగానే వినిపించే పేర్లలో కచ్చితంగా మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆయన కేవలం సౌత్ సినిమాల్లో హీరోగానే కాకుండా విలన్ గా నటిస్తూ మరో వైపు బాలీవుడ్‌ లో వరుసగా సినిమాల్లో నటిస్తూ పాన్ ఇండియా నటుడిగా పేరు దక్కించుకున్నాడు.


గత ఏడాది ఆయన ప్రభాస్ తో కలిసి సలార్‌ సినిమాతో వచ్చిన విషయం తెల్సిందే. సలార్ లో పృథ్వీరాజ్ సుకుమారన్‌ నటనకి మంచి మర్కులు పడ్డాయి. తాజాగా ది గోట్‌ లైఫ్‌ ఆడు జీవితం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కమర్షియల్‌ గా మలయాళ వర్షన్‌ దూసుకు పోతుంది. ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

ఇతర భాషల్లో ఈ సినిమాకు కాస్త అటు ఇటుగా ఫలితం దక్కింది. అయితే ది గోట్‌ లైఫ్ లో పృథ్వీరాజ్ సుకుమారన్‌ నటనకు విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. జాతీయ అవార్డు కచ్చితంగా రావాల్సిందే. రాజకీయాలు చేయకుండా మా సుకుమారన్‌ కి ఇచ్చేయండి అంటూ ఫ్యాన్స్ ఆకాశమే హద్దు అన్నట్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

నెట్టింట పృథ్వీరాజన్ సుకుమార్‌ పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించడంతో పాటు మీడియా వర్గాల వారు మరియు సినీ విమర్శకులు కూడా ఆయన నటన అద్భుతం అన్నట్లుగా ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా కోసం ఒక మనిషి ఇంత కష్టపడుతాడా అంటూ ది గోట్ లైఫ్ సినిమా చూస్తే అనిపిస్తుందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

ది గోట్‌ లైఫ్ సినిమాతో పృథ్వీరాజ్ సుకుమారన్‌ ను ఆకాశమే హద్దు అన్నట్లు ప్రశంసిస్తున్నారు. అయితే ఆయన నటించిన బడే మియా చోటే మియా సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా ఫలితం పై చాలా మందికి నమ్మకం లేదు. పైగా ఆ సినిమాలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పాత్ర విషయంలో కూడా చాలా మంది ఇప్పటికే పెదవి విరుస్తున్నారు.

ప్రస్తుతం ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్న జనాలు బడే మియా చోటే మియా సినిమా విడుదల అయిన తర్వాత నటనకు మరియు పాత్ర ఎంపిక కు విమర్శలు చేయవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తన ప్రతిభ కు తగ్గట్లుగా పృథ్వీరాజ్ సుకుమారన్‌ సినిమాలను ఎంపిక చేసుకోవడం లేదు అనేది కొందరి అభిప్రాయం. ఆ అభిప్రాయం బడే మియా చోటే మియా తో మళ్లీ నిరూపితం అవ్వబోతుందేమో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    
  • Thegoatlife 
  • Prithvirajsukumaran 
  • Bademiyachotemiya 
  • Malayalam 
  • Filmindustry 

Similar News

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Copyright @2026

Powered by Blink CMS