• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్ మీద భయంకరంగా ఎగబడిన...

చరణ్ మీద భయంకరంగా ఎగబడిన జనం… ఎంత ఓపికో..

| యాక్షన్ లేకపోయిన అభిమానంతో మీద పడుతున్న వేలమంది ప్రజల మధ్యలోంచి రామ్ చరణ్ నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

By - Tupaki Desk
Update: 2024-05-12 03:57 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం టాప్ హీరోలలో ఒకడిగా ఉన్నాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తరహాలోనే చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా రామ్ చరణ్ మంచి క్రేజ్ అందుకున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న గేమ్ చేంజర్ మూవీ చరణ్ ఇమేజ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్తుందని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే సినిమాలో చేసిన సన్నివేశాల లాంటి అనుభవాలు నిజ జీవితంలో కొంత మంది లైఫ్ లో జరుగుతాయి. మెగా హీరో రామ్ చరణ్ విషయంలో కూడా అలాంటి సీన్ ఒకటి రియల్ లైఫ్ లో రిపీట్ అయ్యింది. వందల మంది జనం గుంపుగా మీద పడితే కంట్రోల్ చేయడం చాలా కష్టం. అలాంటి వందలాది మధ్యలో భారీ యాక్షన్ సీన్ ఉంటే కచ్చితంగా గూస్ బాంబ్స్ క్రియేట్ చేయడం ఖాయం.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ ఆ విధంగానే చిత్రీకరించారు. ఉద్యమం చేస్తున్న ప్రజల మధ్యలోంచి ఒక్కడిని తీసుకొచ్చేందుకు సింహంలా వారి మధ్య దూకి ఫైట్ చేసి పోలీస్ పవర్ చూపించిన రామ్ క్యారెక్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో అందరికి కనెక్ట్ అయింది. ఆ సీన్ లో రామ్ చరణ్ చేసిన పర్ఫామెన్స్ కి విమర్శకుల ప్రశంసలు లభించాయి. అయితే అలాంటి సిచువేషన్ నిజ జీవితంలో ఎదురయ్యే అవకాశం ఉంటుందని ఎవరు అనుకోరు.

కానీ రామ్ చరణ్ కి పిఠాపురంలో అలాంటి సిచువేషన్ ఎదురయింది. యాక్షన్ లేకపోయిన అభిమానంతో మీద పడుతున్న వేలమంది ప్రజల మధ్యలోంచి రామ్ చరణ్ నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పబ్లిక్ ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు సెక్యూరిటీ సరిపోలేదు. బౌన్సర్స్ బలం కూడా అక్కడ పని చేయలేదు.

దీంతో అభిమానులు అతని మీద పడుతుంటే ఎలాంటి అసహనం లేకుండా వారిని తప్పించుకుంటూ రామ్ చరణ్ ముందుకి నడుచుకుంటూ వెళ్లడం ఆ వీడియోలో కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలపడం కోసం రామ్ చరణ్ పిఠాపురం వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ లో యాక్షన్ సీన్ లాంటి సిచువేషన్ ని రామ్ చరణ్ ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇక రామ్ చరణ్ తో సురేఖ, అల్లు అరవింద్ కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

Global Star @AlwaysRamCharan 🙏❤️ pic.twitter.com/CW98vGRkIu

— Bobby Yedida (@bobby_yedida) May 11, 2024
Tags:    
  • Ramcharan 
  • Globalstar 
  • Pithapuram 
  • Electioncampaign 
  • Janasena 
  • Pawankalyan 
  • Police 
  • Public 
  • RRRmovie 
  • Introductionscene 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS