గ్లామర్ బ్యూటీల విషయంలో నెగ్గే సినిమా ఏది?
అయితే ఈసారి పండక్కి బాక్సాఫీస్ పరంగానే కాకుండా గ్లామర్ విషయంలో కూడా చర్చలు ఎక్కువగా నడుస్తున్నాయి.;
2026 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ చాలా ఎక్కువగా ఉంది. ఈసారి పండక్కి నాలుగైదు సినిమాలు పోటీ పడనున్నాయి. పండగ సీజన్ కాబట్టి మంచి కంటెంట్ తో వస్తే గట్టెక్కే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మేకర్స్ ఎక్కువగా ఈ సీజన్ ను టార్గెట్ చేసి తమ సినిమాలను రిలీజ్ చేయాలని చూస్తుంటారు. అయితే ఈసారి పండక్కి బాక్సాఫీస్ పరంగానే కాకుండా గ్లామర్ విషయంలో కూడా చర్చలు ఎక్కువగా నడుస్తున్నాయి.
గ్లామర్ విషయంలో ముందంజలో రాజా సాబ్
ఈ విషయంలో అందరి కంటే ముందు వరుసలో ఉంది ది రాజా సాబ్. ఈ మూవీలో ఒకరికి ముగ్గురు హీరోయిన్లు నటించడంతో రాజా సాబ్ లో గ్లామర్ స్థాయి కాస్త ఎక్కువే ఉంటుందని ముందు నుంచే అందరికీ క్లారిటీ ఉంది. రాజా సాబ్ లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించడంతో పాటూ, సాంగ్స్ లో తమ డ్యాన్సులతో మెప్పించి, సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే రాజా సాబ్ సినిమా ఎప్పుడూ డిస్కషన్స్ లో ఉండటానికి గల కారణాల్లో హీరోయిన్ల గ్లామర్ కూడా ఒకటి. రాజా సాబ్ లోని పోస్టర్లు, హీరోయిన్ల గ్లామరస్ సాంగ్స్ సినిమాను రెగ్యులర్ గా డిస్కషన్స్ లో ఉండేలా చేశాయి. ఈ సినిమా కాకుండా మిగిలిన సంక్రాంతి సినిమాల హీరోయిన్లు ఎవరూ ఈ విషయంలో ఆడియన్స్ దృష్టిని ఎట్రాక్ట్ చేయలేకపోయారు.
రవితేజ మూవీ నుంచి వామ్మో వాయ్యో సాంగ్
కానీ ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలోని వామ్మో వాయ్యో సాంగ్ వచ్చాక అవన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ఈ సాంగ్ లో రవితేజ స్టైలింగ్, ఎనర్జిటిక్ కొరియోగ్రఫీ, పండగ వాతావరణం కంటే కూడా హీరోయిన్లు అయిన ఆషిక రంగనాథ్, డింపుల్ హయాతి అందాలే అందరినీ ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి.
భర్త మహాశయులకు విజ్ఞప్తి లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో ఈ రేంజ్ డ్యాన్స్ నెంబర్ ను ఎవరూ ఊహించకపోవడంతో ఈ సాంగ్ మరింత ఎట్రాక్షన్ గా మారింది. పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ఈ సాంగ్ లో ఆషిక, డింపుల్ అందాలు నిధి, మాళవిక అందాలను కూడా డామినేట్ చేస్తున్నారు. దానికి తోడు ఈ సాంగ్ ట్రెండింగ్ లో ఉండటంతో ఈ గ్లామర్ డిస్కషన్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పోటీగా మారే అవకాశమూ లేకపోలేదు. మరి చూడాలి ఆఖరికి ఈ పోటీలో ఎవరు గెలుస్తారో?