తన పాత హీరో ల మీద జెనీలియా కామెంట్ విన్నారా?

కాగా జెనీలియా ఇప్పుడు కిరీటి హీరోగా న‌టించిన జూనియ‌ర్ అనే సినిమా ద్వారా మ‌ళ్లీ టాలీవుడ్ కు కంబ్యాక్ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-07-17 06:06 GMT

టాలీవుడ్ లో ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జెనీలియా గ‌త కొన్నేళ్లుగా తెలుగు సినిమాల్లో న‌టించింది లేదు. జెనీలియా పేరు చెప్ప‌గానే అంద‌రికీ గుర్తొచ్చే సినిమా బొమ్మ‌రిల్లు. ఆ సినిమాలో హాసినిగా అంద‌రినీ ఆక‌ట్టుకున్న జెనీలియా స‌త్యం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత ఎన్నో మెమొర‌బుల్ హిట్స్ ను జెనీలియా త‌న అకౌంట్ లో వేసుకున్నారు.

స‌త్యం, ఢీ, రెడీ, బొమ్మ‌రిల్లు లాంటి హిట్స్ అందుకున్న జెనీలియా స్టార్ హీరోల‌తో న‌టించిన ప్ర‌తీసారీ ఆమెకు నిరాశే ఎదురైంది. జూ. ఎన్టీఆర్ తో జెనీలియా నా అల్లుడు, సాంబ సినిమాలు చేయ‌గా ఆ రెండు సినిమాలూ నిరాశ ప‌రిచాయి. అల్లు అర్జున్ తో చేసిన హ్యాపీ, రామ్ చ‌ర‌ణ్ తో చేసిన ఆరెంజ్ సినిమాలు కూడా ఫ్లాపులుగానే నిలిచాయన్న సంగ‌తి తెలిసిందే.

కాగా జెనీలియా ఇప్పుడు కిరీటి హీరోగా న‌టించిన జూనియ‌ర్ అనే సినిమా ద్వారా మ‌ళ్లీ టాలీవుడ్ కు కంబ్యాక్ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో జెనీలియా కూడా చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. అందులో భాగంగా జెనీలియా తాను గ‌తంలో వ‌ర్క్ చేసిన కో స్టార్ల గురించి మాట్లాడారు. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లుగా మార‌డంపై సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో జెనీలియా ఆ ముగ్గురు హీరోల జ‌ర్నీ గురించి మాట్లాడుతూ వాళ్లంతా ఇంత ఎత్తుకు చేరుకోవ‌డం చూసి గ‌ర్వంగా ఉంద‌న్నారు. వాళ్లు కేవ‌లం నా కో యాక్ట‌ర్స్ మాత్ర‌మే కాద‌ని, నాకు ఫ్రెండ్స్ కూడా అని జెనీలియా చెప్పారు. వారు ముగ్గురికీ ఎంతో టాలెంట్ ఉంద‌ని, వారు ఇన్నేళ్లుగా ప‌డిన క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లమే వారిని ఈ స్థాయికి చేర్చింద‌ని, వాళ్ల‌ను పాన్ ఇండియా స్టార్లుగా చూడ‌టం చాలా గొప్ప‌గా అనిపిస్తుందని జెనీలియా అన్నారు. ఎన్టీఆర్ చాలా గొప్ప న‌టుడ‌ని, మూడు పేజీల డైలాగ్ ను కూడా తార‌క్ ఒకేసారి చెప్పేస్తాడ‌ని, అలాంటి న‌టుడిని ఇప్ప‌టివ‌ర‌కు చూడ‌లేద‌ని, రామ్ చ‌ర‌ణ్ కూడా చాలా అద్భుత‌మైన న‌టుడ‌ని, ఆర్ఆర్ఆర్ లో ఎంతో గొప్ప యాక్టింగ్ చేశాడ‌ని చెప్పారు. అల్లు అర్జున్ లో మంచి ఎన‌ర్జీ ఉంటుంద‌ని జెనీలియా ఈ సంద‌ర్భంగా చెప్పారు.


Tags:    

Similar News