• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  10ఏళ్ల తర్వాత ఆ సినిమాకు...

10ఏళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్..

| సినిమాల్లో హారర్ కామెడీ చిత్రాలకు కాస్త క్రేజ్ ఎక్కువే ఉంటుంది.

By - Tupaki Desk
Update: 2023-09-23 11:51 GMT

సినిమాల్లో హారర్ కామెడీ చిత్రాలకు కాస్త క్రేజ్ ఎక్కువే ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్​లో ఇప్పటికే పలు హారర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను అందుకున్న సందర్భాలున్నాయి. అలాంటి వాటిలో 'గీతాంజలి' కూడా ఒకటి. నటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టింది. రాజ్ కిరణ్ దర్శకత్వం వహించారు. ఎంవివి సత్యనారాయణ ప్రొడ్యూస్ చేశారు. కోనా వెంకట్ ఈ సినిమాకు కథ అందించారు. సినిమాను కూడా ఆయనే సమర్పించారు.

అయితే 2014లో వ‌చ్చిన ఈ చిత్రానికి తాజాగా ఇప్పుడు సీక్వెల్ ప్రకటించారు మేకర్స్​. ప్రతీకార జ్వాల‌తో మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది గీతాంజ‌లి.. అంటూ అనౌన్స్ చేశారు. గీతాంజ‌లి మ‌ళ్ళీ వ‌చ్చింది.. పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు కోన వెంక‌టే ఈ సినిమాకు స్టోరీ ఇవ్వడంతో పాటు నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఎమ్​వీవీ సత్యనారాయణ్ అండ్ జీవీ కలిసి ఎమ్​వీవీ సినిమా అండ్ కోనా ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్​పై నిర్మిస్తున్నారు. శివ తుర్ల‌పాటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రవీన్ లక్కరాజు మ్యూజిక్ అందిస్తున్నారు. సుహత సిద్ధార్థ సినిమాటోగ్రఫీ చూసుకుంటున్నారు. అంజలి, శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేశ్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్, రాహుల్ మాధవ్ తదితరులు ఈ సీక్వెల్​లో నటిస్తున్నారు. ఎడిట‌ర్‌ గా చోటా కె ప్ర‌సాద్‌, ఆర్ట్ డైరెక్టర్ గా నార్ని శ్రీనివాస్‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌గా నాగు వై బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం పోస్ట్​ ప్రొడక్షన్, స్క్రిప్ట్​ వర్క్​ కూడా పూర్తైపోయింది. తాజాగా హైదరాబాద్​లో ఈ సినిమా పూజా కార్యక్రమాలో లాంఛనంగా ప్రారంభం కూడా అయింది. పోస్టర్​ను కూడా రిలీజ్ చేశారు. ఓ పాతబ‌డ్డ బంగ్లా ప్రాంగ‌ణంలో అటుగా తిరిగి కూర్చుని ఉన్న అమ్మాయిను పోస్టర్​లో చూపిస్తూ.. ఆస‌క్తితో పాటు భయపెట్టే ప్రయత్నం చేశారు.

కాగా, మొదటి భాగం గీతాంజలి.. ఎంతటి అద్భుత విజయం సాధించిందో తెలిసిన విషయమే. ఈ చిత్రంతోనే నటుడు శ్రీ‌నివాస‌రెడ్డి హీరోగా సిల్వర్​ స్క్రీన్​కు పరిచయం కూడా అయ్యారు. దర్శకుడి పాత్రలో చక్కటి నటనను కనబరిచారు. బ్రహ్మానందం, సత్యం రాజేశ్​, షకలక శంకర్ తమ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేశారు. ఈ సినిమా రిలీజైన దాదాపు 10 ఏళ్ల తర్వాత సీక్వెల్ రావడం ఇంట్రెస్టింగ్​గా ఉంది.

Tags:    
  • Geethanjalimallivachindhi 
  • Anjali 
  • Mvvsatyanarayana 
  • Shivaturlapati 
  • Pravinlakkaraju 
  • Suhathasiddhartha 
  • Srinivasreddy 
  • Satyamrajesh 
  • Satya 
  • Tollywood 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS