• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నార్త్ జనాల కోసం విశ్వక్...

నార్త్ జనాల కోసం విశ్వక్ గ్యాంగ్.. గెట్ రెడీ!

| టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం తన రెండు కొత్త చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-07-03 08:39 GMT

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం తన రెండు కొత్త చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. "మెకానిక్ రాకీ" మరియు "లైలా" సినిమాలతో మరింత భిన్నంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. "లైలా" సినిమా ఇప్పటికే సెట్స్ పైకి వచ్చేసింది. ఇదిలా ఉండగా, విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది.

"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" తెలుగు సినిమా ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ లో అన్ని ప్రధాన భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు, జియో సినిమాలో ఈ చిత్రం హిందీ వెర్షన్ ను జూలై 5, 2024న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా నార్త్ ఆడియెన్స్ ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి. విశ్వక్ సెన్ నటించిన కొన్ని సినిమాలు ఇదివరకే నార్త్ ఆడియెన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేశాయి. డిజిటల్ వరల్డ్ లో అతని సినిమాలకు బాషబేధం లేకుండా మంచి రెస్పాన్స్ అందుతుంది.

ఇక ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా మంచి రెస్పాన్స్ అందుకునేందుకు సిద్ధమయ్యింది. ఈ చిత్రంలో నేహా శెట్టి, అంజలి, సాయి కుమార్, గోపరాజు రమణ, నాజర్, హైపర్ ఆది తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చారు.

"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రంలో విశ్వక్ సేన్ తన భిన్నమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా క్రైమ్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథతో, గ్రామీణ నేపథ్యాన్ని ప్రధానంగా చూపిస్తుంది. ఈ చిత్రం నటుడిగా అతనికి మంచి గుర్తింపు తీసుకు వచ్చింది, దీంతో విశ్వక్ తన నటనను మరింతగా మెరుగుపరచడానికి మరియు వైవిధ్యమైన పాత్రలు చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఇదే సమయంలో, "లైలా" చిత్రం కోసం విశ్వక్ సేన్ మరో కొత్త అవతారంలో కనిపించనున్నాడు. ఈ సినిమా రెండు విభిన్న పాత్రల్లో విశ్వక్ సేన్ ను చూపించనుంది. ఇది ఆయన కెరీర్ లో కొత్త మైలురాయి అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమలతో నేడు లాంచ్ అయ్యింది, మరియు ఫస్ట్ లుక్ అభిమానుల్లో ఎంతగానో ఆసక్తి కలిగిస్తోంది.

ఇక విశ్వక్సేన్ తన కెరీర్ లో ముందుకు సాగుతూ, విభిన్నమైన పాత్రలను పోషించడానికి ఎప్పటికప్పుడు సన్నద్ధం అవుతుండటం, ఆయనకు కొత్త కొత్త అవకాశాలను తెచ్చిపెడుతోంది. "మెకానిక్ రాకీ" మరియు "లైలా" సినిమాలతో ఆయన మరింత ఆకట్టుకుంటారని చెప్పవచ్చు. త్వరలోనే ఈ హీరో మరో క్రేజీ ప్రాజెక్టు పై కూడా ఒక క్లారిటీ ఇవ్వనున్నాడు.

Tags:    
  • Gangsofgodavari 
  • Gangsofgodavarihindi 
  • Vishwaksen 
  • Anjali 
  • Nehashetty 
  • Krishnachaitanya 
  • Tollywood 
  • Gangsofgodavariott 

Similar News

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

సినిమా ప్రొడక్షన్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పాత్ర ప‌రిధి ఎంత‌?

2026-11-07 08:25 GMT

రాహా బర్త్‌డే స్పెషల్.. చిక్ లుక్‌తో ఆకట్టుకున్న అలియా భట్!

2026-11-07 08:23 GMT

నటుడిగా చివరి దశాబ్దం.. డైరెక్టర్ గా స్టార్ హీరో!

2026-11-07 08:22 GMT

Bigg Boss Telugu 10: ఈసారైనా జబర్దస్త్ నరేష్ దొరికిపోతాడా?

2026-11-07 08:20 GMT

చిరు 'లీక్స్' కాదు.. ఇప్పుడు ఫుల్ క్లారిటీ అవసరం!

2026-11-07 06:50 GMT

Copyright @2026

Powered by Blink CMS