• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గంగం గణేశా టీజర్.. చిన్న...

గంగం గణేశా టీజర్.. చిన్న దేవరకొండ హై డోస్

| సరదాగా సాగుతోంది అనుకునేలోపు, విలన్ ఎంట్రీ వచ్చింది. మధ్యలో హీరోయిన్ తో ఘాటు లిప్ లాక్ లు కూడా ఇచ్చాడు

By - Tupaki Desk
Update: 2023-09-15 11:14 GMT

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. తనకు నప్పే కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. రీసెంట్ గా బేబీ మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీ అలా హిట్ అయ్యిందో లేదో, ఇలా మరో సినిమాతో రెడీ అయ్యాడు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం గం గం గణేశా.

ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదల చేశారు. ఉదయ్ భూమిశెట్టి దర్శకత్వం వహించారు.ఈ చెడు ప్రపంచంలో మంచిగా బతకాలి అనుకోవడం చెడు ఆలోచన అనే కొటేషన్ తో టీజర్ మొదలుపెట్టారు. టీజర్ చాలా సరదాగా ఉంది. అమ్మాయిలను టీజ్ చేస్తే పెదాలపై నవ్వు రావాలి కానీ, కళ్ల వెంట నీరు రాకూడదు అంటూ ఆనంద్ చెప్పే డైలాగ్ బాగుంది. టీజర్ లో చాలా ఈజ్ తో కనిపించాడు.

సరదాగా సాగుతోంది అనుకునేలోపు, విలన్ ఎంట్రీ వచ్చింది. మధ్యలో హీరోయిన్ తో ఘాటు లిప్ లాక్ లు కూడా ఇచ్చాడు. ఈ విషయంలో తన అన్నని ఫాలో అవుతున్నాడా అనే కామెంట్స్ వినపడుతున్నాయి. టీజర్ మధ్యలో వినాయకుడి విగ్రహం కనపడుతోంది. మరి, వీరి కథ కు గణేషుడికి సంబంధం ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇప్పటి వరకు చేయని రోల్ ని ఇందులో ఆనంద్ చేసినట్లు తెలుస్తోంది. . హై-లైఫ్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. క్రైమ్ యాక్షన్ డ్రామా గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇక, ఈ సినిమాని నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈలోగా చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. ఇక, ఈ సినిమాలో ఎక్కువ మందిని కొత్తవారిని తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఆనంద్ ని ఇప్పటి వరకు చాలా సాఫ్ట్ గా , పక్కింటి అబ్బాయి పాత్రలోనే చూశారు. ఈ సినిమాతో యాక్షన్ హీరోగా మారే అవకాశం ఉంది. చాలా భిన్నంగా ఈ సినిమా సాగుతుందని చిత్ర బృందం చెబుతోంది.

విజయ్ దేవర కొండ సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్, దొరసాని సినిమాతో అరంగేట్రం చేశాడు. మొదటి సినిమాలో నటన విషయంలో కాస్త తడపడినా, తర్వాతర్వాత నటుడిగా తనను తాను మెరుగుపరుచుకున్నాడు. మరి ఈ మూవీతో కమర్షల్ హీరోగా కూడా మారతాడో లేదో చూడాలి.

Full View
Tags:    
  • Gamgamganeshateaser 
  • Ananddeverakonda 
  • Pragatisrivastava 
  • Udaybommisetty 
  • Gamgamganeshamovie 
  • BABYmovie 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS