• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గేమ్ ఛేంజర్.. బ్యాలెన్స్...

గేమ్ ఛేంజర్.. బ్యాలెన్స్ వర్క్ ఎంత ఉంది?

| కొన్ని రోజుల క్రితం వైజాగ్ లో షెడ్యూల్ జరపగా.. ఇటీవల హైదరాబాద్ లో షూట్ చేశారు.

By - Tupaki Desk
Update: 2024-06-04 11:11 GMT

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. అప్పుడెప్పుడో మొదలైన చిత్రీకరణ ఇప్పటికీ ఇంకా పూర్తవ్వలేదు. శంకర్.. అటు గేమ్ ఛేంజర్ ను తీస్తూ.. ఇటు ఇండియన్-2ను పూర్తి చేశారు. దీంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ పెండింగ్ లో ఉండిపోయింది. కొన్ని రోజుల క్రితం వైజాగ్ లో షెడ్యూల్ జరపగా.. ఇటీవల హైదరాబాద్ లో షూట్ చేశారు.

అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకెప్పుడు పూర్తవుతుంది సారూ అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఈ ఏడాదిలో సినిమా రిలీజ్ ఉంటుందా లేదో కూడా డౌట్ గా ఉందని అంటున్నారు. ఎందుకంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు వరుసగా కల్కి, పుష్ప-2, దేవరతోపాటు మరిన్ని భారీ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వాటితోపాటు మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి.

ఇటీవల ఈ మూవీ రిలీజ్ అక్టోబర్ లో ఉంటుందని గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు కుమార్తె హర్షిత రెడ్డి తిరుమలలో తెలిపారు. దీంతో దేవర ప్రీ పోన్ అవుతుందని.. అదే రోజు గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి. మరికొందరు దీపావళి కానుకగా విడుదల అవ్వనుందని చెబుతున్నారు. వీటి కన్నా ముందు షూటింగ్ పూర్తి చేసి పెద్ద ఎత్తున మేకర్స్ ప్రమోషన్స్ చేపట్టాల్సి ఉందని నెటిజన్లు అంటున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్ మరో 30 రోజులపాటు జరగనున్నట్లు తెలుస్తోంది. అందులో రామ్ చరణ్ వర్కింగ్ డేస్ పది రోజులు మాత్రమేనని టాక్ వినిపిస్తోంది. అంటే జులై స్టార్టింగ్ లో ఈ మూవీ షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టనున్నారన్నమాట మేకర్స్. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్.. త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయండన్నా అని అంటున్నారు. అక్టోబర్ లో ఎలా అయినా రిలీజ్ చేయాలని మేకర్స్ కు రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నారు. ముఖ్యమంత్రిగా, ఐపీఎస్ గా కనిపించనున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కియారా అద్వానీ, అంజలి ఫిమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఎస్‌ జే సూర్య, శ్రీకాంత్‌, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు రానుందో చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Gamechanger 
  • RamCharan 
  • KiaraAdvani 
  • Shakanr 
  • DilRaju 
  • Shooting 
  • Hyderabad 

Similar News

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS