'గేమ్ ఛేంజర్'.. కార్తీక్ సుబ్బరాజ్ ప్లేట్ మార్చారా?

అయితే గేమ్ ఛేంజర్ కు కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు స్టోరీ అందించారన్న విషయం తెలిసిందే.;

Update: 2025-04-24 07:14 GMT

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఆ సినిమా సంక్రాంతికి భారీ అంచనాల మధ్య రిలీజైంది. కానీ డిజాస్టర్ గా మారి నిరాశపరిచింది.

నిర్మాతకు భారీ నష్టాలు వచ్చినట్లు అప్పట్లో టాక్ వినిపించింది. అదే సమయంలో దర్శకుడు శంకర్ టేకింగ్, మేకింగ్ పై సోషల్ మీడియాలో చాలా విమర్శలు వచ్చాయి. వరుసగా ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ ఫ్లాపులుగా మారడంతో శంకర్ శైలిని మార్చుకుంటే బెటర్ అని అంతా సూచించారు. లేకుంటే కష్టమని కామెంట్ చేశారు.

అయితే గేమ్ ఛేంజర్ కు కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు స్టోరీ అందించారన్న విషయం తెలిసిందే. ఆ విషయాన్ని ఆయన కూడా సినిమా రిలీజ్ కు ముందు చెప్పారు. శంకర్ లాంటి దిగ్గజ దర్శకుడికి కథ ఇవ్వడం గొప్ప గౌరవమని అన్నారు. గర్వంగా ఉందని కూడా చెప్పారు. కట్ చేస్తే.. సినిమా రిజల్ట్ మొత్తం రివర్సయింది.

దీంతో ఇప్పుడు ఆయన ప్లేట్ మార్చేశారని నెటిజన్లు అంటున్నారు. ఎందుకంటే అప్పుడు కథ అందించినందుకు గర్వంగా ఉందన్న కార్తీక్ సుబ్బరాజు... ఇప్పుడు తాను ఒక స్థిరపడిన IAS అధికారికి సంబంధించిన స్టోరీ లైన్ మాత్రమే అందించానని చెప్పడం గమనార్హం. ఇతర రచయితల వల్ల స్క్రిప్ట్ అంతా మారిపోయిందన్నారు.

అయితే బాక్సాఫీస్ వద్ద మూవీ రిజల్ట్ ఎవరి కంట్రోల్ కూడా ఉందని వ్యాఖ్యానించారు. ఆడియన్స్ ఇచ్చిన తీర్పును మేకర్స్ అంగీకరించాలని చెప్పారు. దీంతో ఆయన కామెంట్స్ వైరల్ గా మారడంతో నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ కామెంట్స్ లో చాలా ఛేంజ్ కనిపిస్తుందని ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు.

సినిమా విడుదలకు ముందు తాను స్టోరీ లైన్ మాత్రమే ఇచ్చానని ఎందుకు చెప్పలేదని క్వశ్చన్ చేస్తున్నారు. కథ తనదేనని ఆయన గతంలో చెప్పుకున్నారని, ఇప్పుడు సినిమా పరాజయం పాలైన తర్వాత డ్రాప్ అయ్యారని అంటున్నారు. అయితే మూవీ విషయంలో డైరెక్టర్ దే మొత్తం నియంత్రణ ఉంటుందని, కానీ కార్తీక్ సుబ్బరాజ్ అలా మాట్లాడటం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News