• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అభిమానుల కుటుంబాలకు రామ్...

అభిమానుల కుటుంబాలకు రామ్ చరణ్ పరిహారం!

| అయితే.. ఈ వేడుకకు వచ్చిన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-01-08 10:04 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ "గేమ్ ఛేంజర్" సినిమాకు సంబంధించిన ప్రీ రిజీల్ ఈవెంట్ రాజమండ్రిలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత, పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే.. ఈ వేడుకకు వచ్చిన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా.. ఈ కార్యక్రమానికి హాజరైన కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన తోకాడ చరణ్ (22), ఆరవ మణికంఠ అనే ఇద్దరు అభిమానులు.. వేడుక ముగిసిన అనంతరం బైక్ పై తిరిగి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇందులో భాగంగా వీరు ప్రయాణిస్తున్న బైక్ ను వడిశలేరులో ఓ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ చనిపోయారు.

ఈ ఘటన గురించి తెలుసుకున్న సినిమా హీరో రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన అభిమానుల ఇంటికి తన సన్నిహితులతో పాటు తన వ్యక్తిగత సిబ్బందిని పంపించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు చెరో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను తాజాగా కుటుంబ సభ్యులకు అందజేశారు.

అవును... గేమ్ ఛేంజర్ సినిమా ఈవెంట్ కు హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రామాదంలో మృతి చెందడంతో రామ్ చరణ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ.. మృతులు ఇద్దరి కుటుంబాలకు తలో రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ సమయంలో.. ఆ మొత్తాన్ని ఆర్టీజీఎస్ ద్వారా అందించారు. ఈ నేపథ్యంలో తాజాగా దానికి సంబంధించిన వివరాలకు చెర్రీ ఫ్యాన్స్ బాధితుల పేరెంట్స్ కు అందచేశారు.

కాగా.. ఇప్పటికే మృతుల కుటుంబాలకు సినిమా నిర్మాత దిల్ రాజుతో పాటు ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. మృతుల కుటుంబాలకు దిల్ రాజు తలో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించగా.. పవన్ కల్యాణ్ కూడా ఐదేసి లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

అభిమానుల కుటుంబాలకు రాంచరణ్ పరిహారం.'గేమ్ ఛేంజర్' ప్రీరిలీజ్ ఈవెంట్ నుంచి వెళ్తూ రోడ్డుప్రమాదంలో మరణించిన ఇద్దరి కుటుంబాలకు రాంచరణ్ పరిహారం అందజేశారు.RTGS ద్వారా పేమెంట్ చేయగా, దానికి సంబంధించిన వివరాలను చెర్రీ ఫ్యాన్స్ బాధితుల తల్లిదండ్రులకు అందించారు.#RamCharan… pic.twitter.com/hShfWyhHbc

— Tupaki (@tupaki_official) January 8, 2025
Tags:    
  • Ramcharan 
  • Gamechangertragedy 
  • Gamechangermovie 
  • Pawankalyan 
  • Dilraju 
  • Tollywood 
  • Ramcharanfans 
  • Gamechangerevent 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS