• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భీమా టైటిల్ సాంగ్‌.....

భీమా టైటిల్ సాంగ్‌.. గోపిచంద్ గూస్‌బంప్స్ సౌండ్

| మాస్ హై వోల్టేజ్ క్యారెక్టర్ తోనే గోపిచంద్ ఈసారి బిగ్ స్క్రీన్ పై మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది

By - Tupaki Desk
Update: 2024-02-21 15:25 GMT

మాస్ మాచో స్టార్ హీరోగా మంచి గుర్తింపు అందుకున్నాడు గోపీచంద్. ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో కొత్తదనం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ఇక నెక్స్ట్ ఎలాగైనా సాలీడ్ సక్సెస్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. ఇక ప్రత్యేకమైన యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది.

మాస్ హై వోల్టేజ్ క్యారెక్టర్ తోనే గోపిచంద్ ఈసారి బిగ్ స్క్రీన్ పై మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాపై హైప్ పెంచేలా ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. గోపీచంద్ మరియు మాళవిక శర్మల అందమైన కెమిస్ట్రీని హైలెట్ చేస్తూ ఇటీవల విడుదల చేసిన మొదటి సింగిల్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఎ హర్ష దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ గ్రాండ్ గా నిర్మించిన ఈ చిత్రం రెండవ సింగిల్ గల్లీ సౌందుల్లో కొద్దిసేపటి క్రితం విడుదలైంది.

లైవ్లీ కంపోజిషన్‌కు పేరుగాంచిన రవి బస్రూర్ గూస్‌బంప్స్ అందించే సాలీడ్ సౌండ్ ఇచ్చాడు. KGF సలార్ సినిమాల ద్వారా రవి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఇప్పుడు గోపి సినిమాకు కూడా అతను మంచి మ్యూజిక్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. గోపీచంద్ పాత్ర గురించి చెప్పే టైటిల్ ట్రాక్ ఇది.

నేరస్తులను భయపెట్టే అహంకారి పోలీసుగా భీమా క్యారెక్టర్ హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. సంతోష్ వెంకీ తన గాత్రంతో పాటకు మరింత ఎనర్జీ ఇచ్చాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, స్వరకర్త రవి బస్రూర్ మరియు గాయకుడు సంతోష్ వెంకీ కలిసి ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. అద్భుతమైన కంపోజిషన్, సాహిత్యం మరియు శక్తివంతమైన గాత్రం పాటకు మరింత బలాన్ని ఇచ్చాయి.

ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ప్రియా భవానీ శంకర్ నటిస్తుంది. ఇక ఈ సినిమాతో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకొని తన మార్కెట్ పెంచుకోవాలి అని గోపిచంద్ అడుగులు వేస్తున్నారు. ఇక టీజర్ కు అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. రెగ్యులర్ కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఒక కొత్త తరహా పాయింట్ ను సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మరి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Full View
Tags:    
  • Gallisoundullo 
  • Bhimaamovie 
  • Gopichand 
  • Aharsha 
  • Ravibasrur 
  • Santhoshvenky 
  • Bhimaa 

Similar News

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

Copyright @2026

Powered by Blink CMS