గద్దర్ అవార్డ్స్‌లో ఉత్తమ హీరో, చిత్రానికి ఇచ్చేది ఇదే!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ చలన చిత్ర పురస్కారాల కార్యక్రమం శనివారం హైటెక్స్‌లో అంగరంగ వైవంగా జరగనుంది.;
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ చలన చిత్ర పురస్కారాల కార్యక్రమం శనివారం హైటెక్స్‌లో అంగరంగ వైవంగా జరగనుంది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి అవార్డుల కార్యక్రమం జరగకపోవడంతో ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఏర్పాట్లు చేసింది. 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలకు..24 సంవల్సరానికి అన్ని విభాగాలకూ గద్దర్ పురస్కారాలు దక్కనున్నాయి.
సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు, చలన చిత్ర ప్రముఖులు పాల్గొననున్నారు. అయితే ఈ అవార్డుల్లో ఉత్తమ హీరో, హీరోయిన్‌లకు అందించే నగదు బహుమతి ఎంత అనే చర్చ నెట్టింట మొదలైంది. గద్దర్ ఫిల్మ్ అవార్డుల ద్వారా అవార్డులు అందుకున్న వారికి నగదు పురస్కారం కూడా అందించనున్నారు. ఉత్తమ నటుడు, నటికి రూ.5 లక్షలు, ఉత్తమ మొదటి చిత్రానికి రూ.10 లక్షలు, రెండో సినిమాకు రూ.7 లక్షలు, మూడో చిత్రానికి రూ.5 లక్షలు అందజేస్తారు.
అంతే కాకుండా ప్రత్యేక అవార్డులు పొందిన వారికి రూ.10 లక్షలు చొప్పున అందజేయనున్నారు. ఇటీవల గద్దర్ ఫిల్హ్ అవార్డుల జాబితాను తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. పదేళ్ల తరువాత అవార్డుల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుండటంతో ఈ అవార్డులపై అందరి దృష్టి పడింది. శనివారం సాయంత్రం జరిగే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు, హీరోలు పాల్గొననున్నారు.