అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ లో పూజా హెగ్డే.. ఫ్యాన్ నుంచీ ఊహించని ప్రశ్న!

అయితే ఈ కార్యక్రమంలో మెరిసిన కొంతమంది తారలు అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. వారిలో పూజా హెగ్డే కూడా ఒకరు.;

Update: 2026-03-20 07:19 GMT

కరోనా వచ్చిన తర్వాత థియేటర్ల కంటే ఓటీటీలకే ఎక్కువ ప్రయారిటీ లభిస్తోంది. ముఖ్యంగా థియేటర్లలో సినిమాలు చూడలేని చాలామంది ఓటీటీలలో సినిమాలు చూస్తూ వాటికి మంచి రేటింగ్ కూడా అందిస్తున్నారు . ఈ క్రమంలోనే అటు ఓటిటి ప్లాట్ఫార్మ్స్ కూడా మంచి మంచి సినిమాలు, సీరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది అటు ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ భారీ చిత్రాలు, వెబ్ సిరీస్ లను ప్రకటించగా ఇటు అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ఈ ఏడాది స్ట్రీమింగ్ కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ లను అనౌన్స్ చేసింది. ఈ మేరకు ఒక ఈవెంట్ ను కూడా నిర్వహించింది. ఇందులో చాలా మంది సెలబ్రిటీలు సందడి చేశారు.



 


గతంలో మునుపెన్నడూ లేని విధంగా అతిపెద్ద కంటెంట్ స్లేట్ ను ప్రకటించింది. ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ముంబైలో జరిగిన 'ప్రైమ్ వీడియో ప్రెజెంట్స్ 2026' ఈవెంట్ లో భాగంగా సుమారుగా 55 పైగా ఒరిజినల్ సిరీస్ లు, సినిమాలు, థియేటర్ మూవీస్ ను అధికారికంగా ఆవిష్కరించింది. అటు తెలుగుతోపాటు తమిళ్, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ ప్రాజెక్టులు విభిన్న జానర్లలో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడానికి సిద్ధమైపోయాయి.



 


ఇకపోతే ఈ ఈవెంట్ కు సెలబ్రిటీలందరూ తమ ఇన్స్టాగ్రామ్ వేదికగా హైప్ క్రియేట్ పెంచిన విషయం తెలిసిందే. ఇక ఎట్టకేలకు ఆ ఈవెంట్ కూడా ఘనంగా నిన్న జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో మెరిసిన కొంతమంది తారలు అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. వారిలో పూజా హెగ్డే కూడా ఒకరు. ఇకపోతే ఇక్కడ వైట్ , లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో తన డ్రెస్ తో అందరిని ఆకట్టుకుంది. ఇకపోతే ఈమె ఈవెంట్ కి హాజరవుతున్న క్రమంలోనే అక్కడున్న అభిమానులు, కెమెరామెన్స్ ఈమెను ఫోటోలు తీసే ప్రయత్నం చేశారు.. అయితే ఆ సమయంలో ఒక అభిమాని మిమ్మల్ని కలవాలి అని అడగగా ఆమె రండి అని పిలిచింది. అంతలోపే పెళ్లి అని అడగడంతో పెళ్ళా అంటూ హిందీలో అడుగుతూ నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది పూజా హెగ్డే.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



 


2010లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీలో రెండవ స్థానంలో నిలిచిన ఈమె 2012లో వచ్చిన తమిళ చిత్రం ముగమూడీ అనే సినిమాతో సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. ఇక 2014లో ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న పూజా హెగ్డే ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇక ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి ప్రస్తుతం తెలుగులో మళ్లీ సరైన అవకాశం కోసం ఎదురుచూస్తోంది ఈ ముద్దుగుమ్మ.


Tags:    

Similar News