తేజ మరో ఇంట్రెస్టింగ్ స్టెప్.. వరల్డ్ ఫేమస్ షోకు హోస్ట్ గా..
ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న రియాలిటీ షో ది ట్రయిటర్స్ (The Traitors) తెలుగు వెర్షన్ కు తేజ హోస్ట్ గా వ్యవహరించనున్నారు.;
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా కెరీర్ లో ప్రస్తుతం గోల్డెన్ ఫేజ్ లో దూసుకెళ్తున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. వరుస విజయాలతో పాటు చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్టులు ఆయనకు మరింత పాజిటివ్ ఎలిమెంట్ గా మారగా.. ఇప్పుడు కొత్తగా మరో ఇంట్రెస్టింగ్ స్టెప్ వేస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉన్న తేజ సజ్జా, ఇప్పుడు ఓటీటీ వరల్డ్ లోకి హోస్ట్ గా అడుగుపెడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న రియాలిటీ షో ది ట్రయిటర్స్ (The Traitors) తెలుగు వెర్షన్ కు తేజ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఆ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ముంబైలో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్ లో అధికారికంగా ప్రకటించింది. సైకాలజికల్ గేమ్ ప్లే, థ్రిల్లింగ్ ట్విస్టులతో ఫేమస్ అయిన ఆ షోను తెలుగు ప్రేక్షకుల కోసం కూడా తీసుకురావడం విశేషం.
ఇలాంటి గ్లోబల్ ఫార్మాట్ షోకు టాలీవుడ్ యంగ్ హీరోను హోస్ట్ గా ఎంపిక చేయడం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇది తేజ సజ్జా కెరీర్ లో కొత్త ఛాప్టర్ మొదలైనట్లే. సినిమాలతో పాటు కొత్త అవకాశాలను అందుకోవడంలో ఆయన చూపిస్తున్న డేరింగ్, ప్లానింగ్ సూపర్ గా అనే చెప్పాలి. ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అనేక మంది సినీ ప్రియులు తేజకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
అదే సమయంలో తేజ జర్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయన.. చిన్న గ్యాప్ తీసుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. అలా కొన్ని సినిమాలు చేశాక.. హీరో అయిపోయారు. హీరో అవ్వడమే కాకుండా.. పాన్ ఇండియాలో గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ షోకు హోస్ట్ గా సందడి చేయనున్నారు.
ఇక తేజ సజ్జా అప్ కమింగ్ మూవీస్ విషయానికొస్తే.. ఆయన లైనప్ చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన తొలి తెలుగు జాంబీ చిత్రం జాంబీ రెడ్డికి సీక్వెల్ గా జాంబీ రెడ్డి 2 చేయనున్నారు. ఆ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుండగా, 2027 జనవరిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆ చిత్రాన్ని నిర్మిస్తోంది.
గతేడాది మంచి విజయం సాధించిన తేజ నటించిన మిరాయ్ సినిమాకు కూడా సీక్వెల్ సిద్ధమవుతోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆగస్టులో ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. అలాగే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో ప్రాజెక్ట్ జై హనుమాన్ లో కూడా నటించనున్నారు. ఏదేమైనా తేజ సజ్జా కెరీర్ ప్లానింగ్ చాలా స్ట్రాటజిక్ గా సాగుతోంది. సినిమాలు, ఓటీటీ షోలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్న ఆయన.. మరింత క్రేజ్ సంపాదించుకోవడం పక్కా అనే చెప్పాలి.