ధురంధర్ 2.. బాలీవుడ్ సైలెన్స్ ఎందుకు?

అయితే బాలీవుడ్ విషయంలో మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. రిలీజ్ అయిన తర్వాత హిందీ సినీ పరిశ్రమకు చెందిన అగ్ర హీరోల నుంచి సినిమాపై పెద్దగా స్పందన కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.;

Update: 2026-03-20 06:29 GMT

పాన్ ఇండియా రేంజ్ లో మూవీ లవర్స్ ఎంతగానో వెయిట్ చేసిన ధురంధర్ 2: ది రివెంజ్ సినిమా మార్చి 19న థియేటర్లలో విడుదలై సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచి ఆ సినిమా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ హాట్ టాపిక్ గా మారింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ తో పాటు పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు కూడా చిత్రానికి మరింత బలం చేకూరుస్తున్నాయి.

ప్రత్యేకంగా టాలీవుడ్ స్టార్ హీరోలు ధురంధర్ 2పై స్పష్టంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం గమనార్హం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. సినిమాను చూసిన అనంతరం సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. అదే విధంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మూవీకి సపోర్ట్ గా పోస్టులు పెట్టడం ద్వారా సినిమా పై హైప్‌ను మరింత పెంచారు.

అయితే బాలీవుడ్ విషయంలో మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. రిలీజ్ అయిన తర్వాత హిందీ సినీ పరిశ్రమకు చెందిన అగ్ర హీరోల నుంచి సినిమాపై పెద్దగా స్పందన కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్స్ లో బాలీవుడ్ స్టార్ హీరోల నుంచి ప్రశంసలు లేకపోవడం అభిమానుల్లో కొత్త అనుమానాలకు దారి తీస్తోంది.

ఇదిలా ఉంటే సినిమా విడుదలకు ముందు ట్రైలర్ రిలీజ్ సమయంలో మాత్రం బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించారు. స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ ఆలియా భట్, నటుడు విక్కీ కౌశల్ సహా పలువురు సెలబ్రిటీలు ట్రైలర్‌ ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ సినిమా విడుదలైన తర్వాత అదే రేంజ్ లో ఇప్పుడు రెస్పాన్స్ లేకపోవడం గమనార్హం.

దీంతో ఆ విషయంపై అనేక మంది నెటిజన్లు ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నారు. టాలీవుడ్ హీరోలు ఓపెనింగ్ డే నుంచే సినిమా గురించి స్పందిస్తుండగా, బాలీవుడ్ స్టార్ల స్పందన మాత్రం ఆలస్యంగా లేదా తక్కువగా ఉండటంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కొందరు ఇది రీజనల్ ఇండస్ట్రీస్ మధ్య ఉన్న వేర్వేరు పరిస్థితుల వల్ల కావచ్చని అభిప్రాయపడుతున్నారు.

మరికొందరు బాలీవుడ్ ప్రస్తుతం ఇతర సినిమాలు, ట్రెండింగ్ విషయాలపై దృష్టి పెట్టి ఉండవచ్చని అంటున్నారు. అదే సమయంలో టాలీవుడ్ హీరోలు.. ఇండస్ట్రీల మధ్య ఎలాంటి డిఫరెన్స్ చూపించకుండా హిందీ మూవీ అయినా కంటెంట్ పై ప్రశంసలు కురిపించిన విషయాన్ని కొనియాడుతున్నారు. తెలుగు హీరోలు ఎప్పుడూ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ నే కోరుకుంటారని చెబుతున్నారు. ఏదేమైనా సోషల్ మీడియాలో ఏ మాత్రం ధురంధర్ 2 క్రేజ్ తగ్గకుండా కొనసాగుతోంది. ప్రేక్షకుల రివ్యూలు, సెలబ్రిటీ రియాక్షన్లు కలిసి ట్రెండింగ్‌ లో మూవీని నిలబెడుతున్నాయి. రాబోయే రోజుల్లో బాలీవుడ్ ప్రముఖులు చిత్రంపై స్పందిస్తారా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News