బిగ్ బాస్..చిరు లీక్స్ 2.0 స్ట్రాటజీ!
ఈ క్రేజీ ప్రమోషనల్ స్ట్రాటజీకి సంబంధించి మేకర్స్ త్వరలోనే పక్కా క్లారిటీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి సినిమా ప్రమోషన్స్‌లో ఓ అడుగు ముందే ఉంటారు. గతంలో అన్నయ్య సినిమాల షూటింగ్ స్పాట్ నుంచి చిన్న చిన్న క్లిప్స్ స్వయంగా బయటపెడుతూ చిరు లీక్స్ ట్రెండ్‌కు తెరలేపిన బాస్ ఇప్పుడు డిజిటల్ యుగానికి తగినట్లుగా దానిని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తోన్న 158వ చిత్రం కోసం సరికొత్తగా చిరు లీక్స్ 2.0 వ్యూహాన్ని అమలు చేస్తూ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఇటీవల జరిగిన `కొరియన్ కనకరాజు` సక్సెస్ వేడుకలో చిరంజీవి వ్యవహరించిన తీరు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
దర్శకుడు బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి తదుపరి చిత్రం గురించి మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగా టైటిల్ వద్ద ఆగిపోయి `కదిరి` అనే పదాన్ని మాత్రమే ఉచ్చరించి సస్పెన్స్‌లో పెట్టేశారు. దీంతో చిరంజీవి కావాలనే ఈ లీక్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. దీంతో ఆ చిన్న పదం కాస్తా నెట్టింట పెద్ద ట్రెండ్‌గా మారింది. అసలు ఆ టైటిల్ వెనుక ఉన్న పూర్తి అర్థం ఏంటి? ఆ కథాంశం ఎలా ఉండబోతోంది? అని అభిమానులు రకరకాలుగా విశ్లేషించడం ప్రారంభించారు. ఒక సీనియర్ హీరో స్వయంగా సినిమా టైటిల్‌పై ఇలాంటి క్యూరియాసిటీని క్రియేట్ చేయడం మెగాస్టార్‌కే చెల్లుతుందనడంలో సందేహం లేదు.
ఈ క్రేజీ ప్రమోషనల్ స్ట్రాటజీకి సంబంధించి మేకర్స్ త్వరలోనే పక్కా క్లారిటీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న చిత్రానికి సంబంధించిన అఫీషియల్ టీజర్‌తో పాటు పూర్తి టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది. దీంతో ఈ వార్త మెగా అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎలాంటి టైటిల్ పెడతారని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బాబి -మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రంలో చిరు లుక్స్ పూర్తి భిన్నంగా ఉండ బోతున్నట్లు తెలుస్తోంది. `చిరు లీక్స్ 2.0` ద్వారా సినిమాపై క్రియేట్ అవుతున్న హైప్, బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి ఓపెనింగ్స్‌ను తెచ్చిపెడుతుందో? ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి సినిమాల విషయంలో ఇలాంటి లీకులు ఇవ్వడం కొత్తేం కాదు. చెప్పొచ్చో? లేదో? అంటే సస్పెన్స్ మెయింటెన్ చేయడం అన్నయ్యకే చెల్లింది.
ఈ సందర్భంగా అన్నయ్య నుంచి తమ్ముళ్లు విశ్వంభర అప్ డేట్ కూడా వస్తుందని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న సినిమా రిలీజ్ ఆలస్యమవ్వడంతో?
ఆ సినిమా అప్ డేట్స్ కోసం కూడా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే.