నెగెటివ్ కామెంట్స్ కూడా ప్లస్ అయ్యాయా? బిగ్ బాస్ 20కు ఊహించని బజ్

బిగ్ బాస్ 20 కొత్త సీజన్‌కు సంబంధించిన ప్రమోష‌న్స్ వేగం పుంజుకున్నాయి. తాజాగా రిలీజైన ప్రోమో సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.

Update: 2026-08-13 13:30 GMT

బిగ్ బాస్ 20 కొత్త సీజన్‌కు సంబంధించిన ప్రమోష‌న్స్ వేగం పుంజుకున్నాయి. తాజాగా రిలీజైన ప్రోమో సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. సాధారణంగా బిగ్ బాస్ ప్రోమోలు.. హోస్ట్ ప్రెజెన్స్, ఫార్మాట్ క్లూస్ లేదా కంటెస్టెంట్లపై ఆసక్తిని పెంచుతాయి. అయితే ఈసారి మెయిన్ గా డిస్క‌ష‌న్స్ లో నిలిచింది ప్రోమోలో వాడిన డిజిటల్ విజువల్ ట్రీట్‌మెంట్.

సల్మాన్ ఖాన్ కనిపించిన లుక్‌కు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ, విజువల్స్‌లో ఏఐ, వీఎఫ్ఎక్స్ వినియోగం ఎక్కువగా కనిపించిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రోమోలోని కొన్ని షాట్లు సహజత్వాన్ని కోల్పోయినట్లు అనిపించాయని, ప్రోమోను స్టూడియోలో సింపుల్ గా చేసి ఉంటే ఇంకా ఇంపాక్ట్ ఉండేద‌నే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇటీవలి కాలంలో వినోద రంగంలో ఏఐ ఆధారిత విజువల్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, ఆడియ‌న్స్ టెక్నాల‌జీని స్వీకరిస్తూనే నేచుర‌ల్ ప్రెజెన్స్‌ను కూడా ఆశిస్తున్నారని ఈ రెస్పాన్స్ సూచిస్తుంది. ముఖ్యంగా రియాలిటీ షోల విషయంలో ఆథెంటిసిటీకి ఆడియ‌న్స్ ప్రాధాన్యం ఇస్తారనే అభిప్రాయం బలపడుతోంది.

అయితే విమర్శల మధ్య మరో ఇంట్రెస్టింగ్ అంశం కూడా కనిపిస్తోంది. ప్రోమోపై వచ్చిన డిస్క‌ష‌న్ మొత్తం షోకు భారీ విజిబిలిటీని తీసుకొచ్చింది. ఏఐ, వీఎఫ్ఎక్స్ పై వచ్చిన నెగెటివ్ కామెంట్లు కూడా బిగ్ బాస్ సీజ‌న్‌20పై ఆసక్తిని తగ్గించలేదు. ప్రోమో రిలీజ్ త‌ర్వాత సెప్టెంబర్ 6న ప్రారంభం కానున్న కొత్త సీజన్ గురించి సోషల్ మీడియాలో ఫ్యాన్ థియరీలు, ఫార్మాట్ అంచనాలు, ఎలిమినేషన్ ట్విస్ట్‌లపై డిస్క‌ష‌న్స్ మరింత పెరిగాయి.

ఇక్కడ సల్మాన్ ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రోమోలోని విజువల్స్‌పై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, హోస్ట్‌గా ఆయన కనిపించిన తీరు షో హైప్‌ను పెంచిందని అభిమానులు భావిస్తున్నారు. బిగ్ బాస్ బ్రాండ్‌కు సల్మాన్ ఇప్పటికీ మెయిన్ ఎట్రాక్ష‌న్ గానే ఉన్నారనే అభిప్రాయం సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తోంది.

ప్ర‌మోష‌న‌ల్ ప‌రంగా చూస్తే, ఈ ప్రోమో తన టార్గెట్ ను అందుకున్న‌ట్టే కనిపిస్తోంది. విమర్శలు వచ్చినా, ప్రశంసలు వచ్చినా, బిగ్ బాస్ 20 ఇప్పుడు డిస్క‌ష‌న్స్ లో ఉంది. టెలివిజన్‌తో పాటు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఈ సీజన్‌కు మంచి ఓపెనింగ్ వ్యూయర్‌షిప్ వచ్చే అవకాశాలున్నాయని ఇండ‌స్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చివరికి ఏఐపై జరిగిన డిబేట్ కంటే, ఆ డిబేట్ సృష్టించిన హైప్‌నే బిగ్ బాస్ సీజ‌న్20కు పెద్ద అడ్వాంటేజ్‌గా చెప్పొచ్చు.

Tags:    

Similar News