సెల్ఫీ ఫోజులతో మెస్మరైజ్ చేస్తున్న లక్ష్మీరాయ్.. ఫోటోలు వైరల్!

ప్రస్తుతం లక్ష్మీ రాయ్ ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి.;

Update: 2026-03-20 08:30 GMT

సెలబ్రిటీలు కాస్త విరామం దొరికింది అంటే చాలు విదేశాలకు వెళ్ళిపోయి వెకేషన్ అంటూ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అలాంటిది సమ్మర్ వస్తే వదులుతారా ? అలా సమ్మర్ వచ్చిందో లేదో అప్పుడే వెకేషన్స్ మొదలు పెట్టేసారు హీరోయిన్స్. అక్కడ చిట్టి పొట్టి బట్టలతో అందాలు ఆరబోస్తూ అభిమానులను మెస్మరైజ్ చేస్తున్నారు. అందం , అభినయంతో కట్టిపడేస్తూ గ్లామర్ వలకబోస్తూ యువతకు మంచి ట్రీట్ ఇస్తున్నారు. అలాంటి వారిలో లక్ష్మీ రాయ్ కూడా ఒకరు.

 

1989 మే 5న కర్ణాటక బెల్గాంలో జన్మించిన లక్ష్మీ రాయ్ ఎక్కువగా తమిళ్ , మలయాళం భాషల్లో నటిస్తూ మంచి పేరు సొంతం చేసుకుంది. సినిమా రంగంలోకి రాకముందు మోడల్గా, యాంకర్ గా తన ప్రస్థానాన్ని కొనసాగించిన ఈమె నటిగా స్థిరపడిపోయింది. 2005లో కర్క కసదర అనే తమిళ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి నటిగా అరంగేట్రం చేసిన ఈమె.. అదే ఏడాది తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. పేరుకే కన్నడ ఇండస్ట్రీ అయిన ఈమెకు అవకాశం లభించింది మాత్రం తమిళంలోనే..

 

ఇక 2005లో తెలుగు, తమిళ్ చిత్రాలతో వచ్చిన గుర్తింపుతో వాల్మీకి అనే కన్నడ చిత్రంలో నటించి కన్నడ రంగ ప్రవేశం చేసింది. ఇక తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చిన లక్ష్మీరాయ్ నీకు నాకు, అధినాయకుడు, ఖైదీ నెంబర్ 150 , వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం హిందీ, తమిళ్ , మలయాళం చిత్రాలలో నటిస్తూ దూసుకుపోతున్న ఈమె అప్పుడప్పుడు పలు స్పెషల్ సాంగ్ లు చేస్తూ అలరిస్తోంది.

ఇదిలా ఉండగా కాస్త సినిమాల నుండి విరామం దొరకడంతో వెకేషన్ కి వెళ్ళిపోయిన ఈమె అక్కడ అందాలు ఆరబోస్తూ సమ్మర్ స్పెషల్గా చిల్ అవుతూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన లక్ష్మీరాయ్ సెల్ఫీ ఫోజులతో అభిమానులలో గిలిగింతలు పెట్టింది.

ఈమధ్య ఎక్కువగా ఇలాంటి అవుట్ ఫిట్లతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న లక్ష్మీరాయ్ మరొకవైపు తాను చిల్ అవుతూనే.. ఇలా ఇంకోవైపు ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.

 

ప్రస్తుతం లక్ష్మీ రాయ్ ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి.ఇక లక్ష్మీరాయ్ విషయానికి వస్తే.. ఒకవైపు సినిమాలే కాకుండా మరొకవైపు రియాల్టీ షోలు , వెబ్ సిరీస్లలో కూడా దూసుకుపోతోంది . బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ లో గెస్ట్ గా సందడి చేసిన ఈమె ..కామెడీ స్టార్స్ సీజన్ 3 మలయాళం లో జడ్జిగా కూడా వ్యవహరించింది. ఒకవైపు సినిమాలు మరొకవైపు షో లు అంటూ బిజీగా మారుతూనే మరొకవైపు అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి ఇలా గ్లామర్ తో ఆకట్టుకుంటుంది లక్ష్మీ రాయ్.

Tags:    

Similar News