మా మధ్య లవ్ అప్పుడే మొదలైంది: యామి గౌతమ్
`యూరి ది సర్జికల్ స్ట్రైక్` చిత్రంతో దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు ఆదిత్యాధర్.;
`యూరి ది సర్జికల్ స్ట్రైక్` చిత్రంతో దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు ఆదిత్యాధర్. ఈ సినిమా విక్కీ కౌశల్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా మారింది. ఆరంగేట్రమే దర్శకుడిగా నిరూపించిన ఆదిత్యాధర్ అంతకుముందు రచయితగా, లిరిసిస్టుగాను పని చేసాడు. అయితే దర్శకుడిగా ఇప్పుడు తన కెరీర్ రెండో చిత్రంతోనే సంచలనం సృష్టించాడు. కెరీర్ రెండో చిత్రం దురంధర్ ఈ వారంతంలో 1000 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టబోతోంది. ఈ సినిమా ఇప్పటికే 900కోట్లు వసూలు చేసి, బాక్సాఫీస్ వద్ద స్థిరంగా ముందుకు సాగుతోందని ట్రేడ్ చెబుతోంది.
2019-2025 మధ్య ఆదిత్యా ధర్ కెరీర్ పీక్స్ కి చేరుకుంది. అయితే అతడి కెరీర్ పోరాటం మాత్రం 2009లో మొదలైంది. ఆరంభం కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలకు డైలాగులు, లిరిక్స్ కూడా రాసాడు. కొన్ని సినిమాలకు కథలు అందించాడు. ఇప్పుడు అతడు `కెప్టెన్ ఆఫ్ ది షిప్` పాత్రలోను నిరూపించుకుంటున్నాడు.
`ధురందర్` పరిశ్రమలో చాలా రికార్డులను సవరిస్తూ, విడుదలైన కేవలం 19 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్ల మార్కును దాటింది. `ఉరి` చిత్రం వృత్తిపరమైన ప్రయాణాన్ని మార్చడమే కాకుండా ఆదిత్యా జీవితంలోకి యామీ గౌతమ్‌ను పరిచయం చేసి వ్యక్తిగత జీవిత గమనాన్ని కూడా మార్చింది. ఈ జంట 2021లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. వారి వైవాహిక జీవితంలో నాలుగు సంవత్సరాలు చూస్తుండగానే పూర్తయ్యాయి.
తాజా ఇంటర్వ్యూలో యామి గౌతమ్ మాట్లాడుతూ.. ఆదిత్యాధర్ తో తన లవ్ ఎలా మొదలైందో వెల్లడించారు. ఆ సినిమా చిత్రీకరణ ముగిశాక ప్రమోషన్స్ కోసం కలిసి పని చేసాము. ఆ సమయంలో మంచి స్నేహితులం అయ్యాము. పని విషయంలో ఆదిత్య, నేను చాలా సారూప్యత కలిగి ఉంటాము. మాకు పని చేయడం అంటే చాలా ఇష్టం. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఒక సాధారణ కుటుంబంలా ఉంటాము. మేము ఎప్పుడూ బయటకు వెళ్లాలి, అది అవసరం! అని అనుకోలేదు. యూరి చిత్రీకరణ సమయంలో మేము ఐదుగురం కలిసి సినిమాను ప్రమోట్ చేసాము. ప్రతి ప్రశ్న అందరికీ పంపుతాడు. మీరు అన్ని ప్రశ్నలు.. సమాధానాలను వింటున్నప్పుడు.. అకస్మాత్తుగా ఒకే రకమైన సమాధానం వస్తుంది. అప్పుడు మీ ఆలోచనలు సరిపోలుతాయి! అని యామి అన్నారు.
ఆదిత్యాధర్ భార్యగా కాదు, ఒక కళాకారిణిగా చెప్పాలంటే అతడు పరిశ్రమలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తి. అతడి వ్యక్తిత్వం గురించి సెట్లో పని చేసే కళాకారిణులు చెబుతాడు. అతడు గౌరవాన్ని డిమాండ్ చేయడు.. దానిని పొందే విధానం అద్భుతం. షూటింగ్ అనేది చాలా ఒత్తిడితో కూడిన పని.. ఒక దర్శకుడి ఉద్యోగం ఎవరికైనా ఏం చెప్పి చేయించినా అది నిర్వహణకు సంబంధించిన వ్యవహారం కదా`` అని అన్నారు.
ఆదిత్యా ఎప్పుడూ కోపానికి లోను కాడు. అతడు సహనం కోల్పోవడం ఎప్పుడూ చూడలేదు. ప్రశాంతమైన ప్రవర్తనతో అతడు ప్రతిదీ మ్యానేజ్ చేస్తాడు. అతడు వ్యక్తిగా చాలా ఓపిక గలవాడు..నిజ జీవితంలోని సమస్యలకు పరిష్కారం కనుగొనడంలో ముందుంటాడు. `ఉరి` సమయంలో కూడా ఇవన్నీ చూసాక, అతడిపై చాలా గౌరవం కలిగిందని యామి అన్నారు. ప్రమోషన్ల సమయంలో స్నేహితులం అయ్యాము. నేను నీకు ప్రపోజ్ చేయబోతున్నాను లాంటి సిగ్నల్స్ ఏవీ లేవు. మామధ్య ఎలాంటి సినిమాటిక్ సన్నివేశాలు లేవు.. ఎందుకంటే నేను అలాంటి వ్యక్తిని కాదు. మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని మాకు తెలుసు. మా కుటుంబాలు పూర్తిగా ఏకీభవించాయి..ఇరువైపులా మా విషయంలో చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు.
యామీ గౌతమ్- ఆదిత్య ధర్ వివాహం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఈ జంట కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రజలకు దూరంగా పర్వతాలలో కేవలం అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఒకవేళ కోవిడ్ లేకపోయినా ఇలానే తాము పెళ్లి చేసుకునేవాళ్లమని కూడా యామి తెలిపారు. నా వరకు కొండలలో ప్రకృతి ఆశీస్సులు పొందడం అంటేనే సర్వస్వం. మేము దేనికన్నా ఎక్కువగా ఆచారాలకే ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాము. మేము మా సంస్కృతిని .. హిందూ సంప్రదాయాలను ప్రేమిస్తాము. అవి చాలా అందమైనవి. నేను ఆచారాలను పాటించి, నా పెళ్లిలో నేను కనిపించినట్లే కనిపించాలనుకున్నాను.. అని తెలిపారు. పెళ్లి తర్వాత, `ఆర్టికల్ 370` ప్రమోషన్ల సమయంలో యామి గర్భవతి. ఆ తర్వాత మగబిడ్డకు జన్మనిచ్చారు.