ఆయ‌న్ని గుడ్డిగా న‌మ్మితే నిండా మునిగిన‌ట్లే!

ఓ స్టార్ హీరో చిత్రాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లో సెప్టెంబ‌ర్ లోనే రిలీజ్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు

Update: 2024-01-31 11:30 GMT

ఓ స్టార్ హీరో చిత్రాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లో సెప్టెంబ‌ర్ లోనే రిలీజ్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. అంత‌కు ముందు అదే హీరో న‌టించిన ఓ సినిమాని అదే తేదీకి రిలీజ్ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో ఆ తేదీకి తేస్తే తిరుగుండ‌దు..కొట్టేస్తాం అన్న రేంజ్లో ..అంతే న‌మ్మ‌కంతోనూ అధికారికం చేసారు. అయితే ఆ రిలీజ్ తేదికి హీరో స‌హ‌కారం ఎంత‌వ‌ర‌కూ ఉంటుంది? అన్న‌దే ఇక్క‌డ పెద్ద మిస్ట‌రీ.

ఇప్ప‌టికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది ఆ సినిమా. మ‌రో 20 శాతం షూటింగ్ స‌హా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఉన్నాయి. యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ సినిమా కావ‌డంతో విజువ‌ల్ ఎఫెక్స్ట్ కి ఎక్కువ ప్రాధాన్య‌త ఉండ టంతో టెక్నిక‌ల్ గానూ ప‌ని ఎక్కువ‌గానే ఉంటుంది. ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే హీరో స‌హ‌కారం అన్న‌ది ఇక్క‌డ‌ అంత్యంత కీల‌క‌మైన‌ది. చిత్ర యూనిట్ కి అన్ని ర‌కాలుగా హీరో అందుబాటులో ఉండి స‌హ‌కారం అందించాలి.

చెప్పింది చెప్పిన‌ట్లుగా..పెండింగ్ షూటింగ్ మొత్తానికి ఓ ప్రణాళిక ప్ర‌కారం డేట్లు కేటాయించాలి. మ‌ధ్య‌లో ఎక్క‌డా డీవియేట్  కాకుండా చూసుకోవాలి. మ‌రి ఇదంతా హీరో ప‌క్కాగా చేయ‌గ‌లిగితే నిర్మాత ఇచ్చిన మాట ప్ర‌కారం సినిమా రిలీజ్ చేయ‌డానికి అవ‌కాశం ఉంటుంది. ప్ర‌స్తుతానికి హీరో ఏపీలో ఎంత బిజీగా ఉన్నాడో తెలిసిందే. ఆ త‌ర్వాత ఆయ‌న ప్ర‌ణాళిక ఎలా ఉంటుంద‌న్న‌ది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సినిమాతో పాటే ఇంకా ఆయ‌న పూర్తి చేయాల్సిన సినిమాలు ఉన్నాయి.

ఆ సినిమా డేట్లు..ఈ సినిమా డేట్లు ఎక్క‌డా క్లాష్ అవ్వ‌కుండా చూసుకోవాలి. ఇది కూడా ప‌క్క‌న‌బెడితే ఈ సినిమాల‌న్నింకంటే ముందే ప్ర‌క‌టించి సెట్స్ పైకి తీసుకెళ్లిన ప్రాజెక్ట్ ఏ కార‌ణంతో ఆగిపోయిందో ఇంత వ‌ర‌కూ క్లారిటీ లేదు. వాటిలో ప్ర‌ధానంగా హీరో స‌వ్యంగా డేట్లు కేటాయించ‌క‌పోవ‌డంతోనే అస‌లు స‌మ‌స్య‌ త‌లెత్తింద‌ని ఫిలిం స‌ర్కిల్స్ లో ప్ర‌చారం సాగింది. వేరే సినిమాల‌కు డేట్టు ఇవ్వ‌కుండా ఒకే ప్రాజెక్ట్ పై ఉంటే ఇప్ప‌టికే ఆసినిమా పూర్త‌య్యేది అన్న‌ది కొంద‌రి వాద‌న‌. ఇలాంటి సందేహాలే తాజాగా ప్ర‌క‌టించిన రిలీజ్ తేదీపై ర‌క‌ర‌కాల అనుమానాల‌కు దారి తీసేలా చేస్తుంద‌ని వినిపిస్తుంది.


Tags:    

Similar News